Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా మహిమ.. ఫైనల్‌ ఆడకుండానే ట్రోఫీ సొంతం!!

Coronavirus pandemic: Australia’s Sheffield Shield final cancelled, New South Wales crowned champions

సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా (కోవిడ్‌ 19) వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రేక్షకులతో కళకళలాడాల్సిన మైదానాలు ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఎన్నో ఆటలు రద్దైయ్యాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా జనాలు గుమిగూడటం మంచిది కాదని ఆయా దేశ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో ఫుట్‌బాల్‌ టోర్నీలన్నింటికీ 'ఫిఫా' నెలన్నరపాటు ఫుల్‌స్టాప్‌ పెడితే.. ఆల్‌ఇంగ్లండ్‌ ఓపెన్‌ మినహా మిగిలిన టోర్నీలకు బ్యాడ్మింటన్‌ సమాఖ్య మంగళం పాడింది. ఇక ఎన్నో క్రికెట్ సిరీస్‌లు, లీగ్‌లు రద్దైయ్యాయి. మొత్తానికి కొవిడ్‌-19 క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది.

ఫైనల్‌ ఆడకుండానే విజేత:

ఫైనల్‌ ఆడకుండానే విజేత:

తాజాగా ఈ కరోనా ప్రభావం ఆస్ట్రేలియాలో నిర్వహించే దేశవాళీ క్రికెట్‌ షెఫీల్డ్‌ ఫీల్డ్‌ టోర్నీపై పడింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో షెఫీల్డ్‌ ఫీల్డ్‌ టోర్నీని ఫైనల్‌ రౌండ్‌ ఆడించకుండానే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నిలిపివేసింది. ఇప్పటివరకు జరిగిన లీగ్‌ మ్యాచ్‌లలో న్యూ సౌత్‌వేల్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. విక్టోరియా రెండో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సీఏ మంగళవారం సౌత్‌వేల్స్‌ను విజేతగా ప్రకటించింది. దీంతో షెఫీల్డ్‌ ఫీల్డ్‌ టోర్నీలో న్యూ సౌత్‌వేల్స్‌ జట్టు ఆరేళ్ల తర్వాత ఛాంపియన్‌గా అవతరించింది.

ప్రభుత్వాదేశాల మేరకే..:

ప్రభుత్వాదేశాల మేరకే..:

ప్రభుత్వం, వైద్యాధికారుల సూచనల మేరకు మేము చేయాల్సిందంతా చేస్తున్నామని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. 'ప్రభుత్వం, వైద్యాధికారుల సూచనల మేరకు నడుచుకుంటున్నాం. మా కార్యాలయాలను మూసివేసి సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని చెప్పాం' అని సీఏ తెలిపింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ సిరీస్ కూడా రద్దైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ అర్థంతరంగా రద్దు చేసుకుంది. అయితే వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించింది.

ఊపిరిపీల్చుకున్న సీఏ:

ఊపిరిపీల్చుకున్న సీఏ:

తొలి వన్డేకు ముందు ఆసీస్‌ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెంటనే అతనికి కరోనా పరీక్షలు చేయించింది. అతడికి నెగెటివ్‌ అని రిపోర్ట్‌ రావడంతో జట్టు సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రిచర్డ్‌సన్‌కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్‌సన్‌కు బదులు సీన్‌ అబాట్‌ను సీఏ ఎంపిక చేసింది. అయితే టెస్టుల అనంతరం రిచర్డ్‌సన్‌ మైదానానికి వెళ్ళాడు. రిచర్డ్‌సన్‌ దెబ్బతో షెఫీల్డ్‌ ఫీల్డ్‌ టోర్నీనే సీఏ రద్దు చేసింది.

Story first published: Tuesday, March 17, 2020, 13:33 [IST]
Other articles published on Mar 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+