
దుబాయ్ మీదుగా భారత్‌కు:
ఈనెల 12 నుంచి 18 వరకు భారత్‌తో దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. భారత్‌లో ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్ భయం మాకు లేదు, కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్నామని, భారత్‌లో పర్యటించే తమ జట్టుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని దక్షిణాఫ్రికా బోర్డు తాజాగా స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా జట్టు దుబాయ్ మీదుగా భారత్‌కు రానుంది. ప్రొటీస్ జట్టు సోమవారం డిల్లీకి చేరుకోనుంది. అక్కడి నుంచి మ్యాచ్‌లు జరిగే ధర్మశాల, లక్నో, కోల్‌కతాలకు ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు పయనిస్తారు.

కరోనా భయం లేదు:
'కరోనా వైరస్‌పై మాకు ఆందోళన లేదు. భారత్ పర్యటనకు రావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము దుబాయ్ మీదుగా భారత్‌కు వస్తాం. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఒక రోజు ఉంటాం. మ్యాచ్‌లు జరిగే నగరాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదు. అలాగే ముందస్తు జాగ్రత్తగా జట్టు ప్రయాణించే నగరాలకు ప్రత్యేక విమానంలోనే పయనిస్తారు. దుబాయ్, ఢిల్లీల్లో కూడా కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది' అని సీఎస్‌ఏ తెలిపింది.

సోమవారం భారత్‌కు సఫారీలు:
భారత్‌లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎస్‌ఏ చెప్పింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ షుయబ్ మంజ్రా కూడా వారితోనే ప్రయాణిస్తాడని పేర్కొంది. సోమవారం భారత్ పర్యటనకు సఫారీలు రానున్నారు. మార్చి 12వ తేదీన ధర్మశాల వన్డేతో ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. మార్చి 15వన లక్నోలో రెండో వన్డే, మార్చి 18న కోల్‌కతాలో మూడో వన్డే జరుగనుంది.

అనేక క్రీడా టోర్నీలు రద్దు:
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా టోర్నీలు రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇక భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-13 కూడా యథావిథాగా నిర్వహిస్తామని, అంతకన్నా ముందు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పష్టం చేశారు.

దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (కెప్టెన్), టెంబా బవుమా, రస్సీ వాన్ డర్ డస్సెన్, డుప్లెసిస్, కైలీ వెర్రేన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్ స్మట్స్, అండైల్ ఫెహ్లుక్వాయో, లుంగీ ఎంగిడి, లుతో సిప్లామా, బ్యూరన్ హెండ్రిక్స్, ఆన్రిచ్ నోర్జ్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్.


Click it and Unblock the Notifications












