Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడి క్రికెటర్లకు 'కరోనా' ఇన్సూరెన్స్‌.. 3200 మందికి రక్షణ!!

Coronavirus insurance cover for CAB cricketers and match officials

కోల్‌కతా: ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 16, 563 కాగా.. బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. ఇక భారత దేశంలో కరోనతో 10 మంది మృతి చెందగా.. వైరస్ సోకినా వారి సంఖ్య 511కు చేరింది. కరోనా పంజా విసురుతుండడంతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేపట్టాయి. అయితే కరోనా బారిన పడిన వారికి కూడా చికిత్సలు అందించేలా బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకువచ్చింది.

కరోనా వైరస్ పంజా విసురుతుందాంతో బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) తమ క్రికెటర్లకు భరోసా ఇచ్చింది. బెంగాల్‌ తరఫున ఆడుతున్న క్రికెటర్లు, అంపైర్లు, స్కోరర్లు, మహిళా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ సదుపాయాన్ని కల్పించనుంది. క్యాబ్‌ తరఫున తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్.. కరోనా వైరస్‌కు వ‌ర్తింస్తుంద‌ని తాజాగా తెలిపింది. దీంతో మొత్తం 3,200 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

తాజాగా తమకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యం అందించే కంపెనీతో సమావేశమైన క్యాబ్‌ ప్రతినిధులు.. కరోనా వైరస్‌కు ఇన్సూరెన్స్ వర్తించడంపై పూర్తి స్పష్టత తీసుకున్నారు. కరోనా వైరస్ కేసులకు సంబంధించి క్లైమ్‌లు రిజెక్టు కాబోవని క్యాబ్ స్ప‌ష్టం చేసింది. ఈ క్రమంలో కరోనా వైరస్ గురించి ఎవ‌రూ కంగారు పడాల్సిన అవసరం లేదని క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా తెలిపాడు. కరోనా వైరస్ నేపథ్యంలో తమ కార్యాలయాలను శనివారం వరకు తొలుత మూసివేస్తామ‌ని క్యాబ్ ప్ర‌క‌టించింది. అనంతరం దీన్ని ఈ నెల 27 వరకు పొడ‌గిస్తున్నట్లు స్పష్టం చేసింది.

జస్టిస్‌ ఆర్‌ఎమ్‌ లోధా కమిటీ సిఫార్సు చేసిన కూలింగ్‌ పీరియడ్‌ నుంచి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి మినహాయింపు ఇవ్వాలని.. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ విషయంలో తొలి పిటీషన్‌ దాఖలు చేసిన ఆదిత్య వర్మ సుప్రీం కోర్టును కోరనున్నారు. గంగూలీ లాంటి నాయకుడు పూర్తికాలం సేవలందించకపోవడం సరైంది కాదని భావించే పిల్‌ వేయనున్నట్లు ఆదిత్య వర్మ పేర్కొన్నారు. 'బీసీసీఐ నిబంధనలు మార్చాలని కోరిన నేనే.. గంగూలీ విషయంలో మినహాయింపు నివ్వాలని అడుగుతున్నా. దాదా ప్యానల్‌ మూడేళ్ల పాటు పదవిలో ఉంటే.. క్రికెట్‌కు మేలు జరుగుతుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నా' అని వర్మ అన్నారు.

Story first published: Tuesday, March 24, 2020, 16:32 [IST]
Other articles published on Mar 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+