Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2021: బాక్సింగ్ డే టెస్టులో క‌రోనా క‌ల‌క‌లం.. ఏకంగా ఐదుగురికి పాజిటివ్‌

Corona positive for five Members in Australia vs England boxing Day Test

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న మెల్‌బోర్న్ టెస్టులో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్ డే సంద‌ర్భంగా యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా ఐదుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇంగ్లండ్ క్రికెట్ బృందంలోని న‌లుగురికి క‌రోనా సోక‌గా.. మ‌రోక జ‌ర్న‌లిస్ట్‌కు కూడా క‌రోనా సోకింది. దీంతో మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో ఐదుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా బారిన ప‌డ్డ వారిలో ఇంగ్లండ్ క్రికెట్ టీం స‌హాయ‌క బృంద‌లోని ఇద్దరు స‌భ్యులు కాగా, మ‌రో ఇద్ద‌రు ఇంగ్లండ్ క్రికెట్ టీం స‌హాయ‌క బృందానికి చెందిన కుటుంబ‌స‌భ్యులు.

అదే విధంగా బాక్సింగ్ డే టెస్టును క‌వ‌ర్ చేస్తున్న స్థానిక మీడియా అయినా న్యూస్‌7 కు సంబంధించిన ఓ జ‌ర్న‌లిస్ట్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు. దీంతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఐదుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా సోకిన వారంద‌రినీ ఐసోలేష‌న్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో వీరంద‌రికీ పాజిటివ్‌గా నిర్దార‌ణ అయిన‌ట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. అయితే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు లేద‌ని తెలిపింది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాక మ్యాచ్ ప్రారంభించిన‌ట్టు వివ‌రించింది.

అర్ధ గంట ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభం

బాక్సింగ్ డే టెస్టులో క‌రోనా క‌లక‌లం రేగ‌డంతో రెండో రోజైన సోమ‌వారం మ్యాచ్ 30 నిముషాలు ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 61-1తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా స్ట‌డీగా బ్యాటింగ్ చేస్తోంది. జ‌ట్టు స్కోర్ 76 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 10 ప‌రుగులు చేసిన నాథ‌న్ లియోన్‌ను రాబిన్స‌న్ ఔట్ చేశాడు. 84 ప‌రుగుల వ‌ద్ద సూప‌ర్ ఫామ్‌లో ఉన్న మార్న‌స్ ల‌బుషేన్‌ను మార్క్ వుడ్ ఒక్క ప‌ర‌గుకే ఫెమిలియ‌న్ పంపాడు.

110 ప‌రుగుల వద్ద 16 ప‌రుగులు చేసిన స్మిత్‌ను అండ‌ర్స‌న్ ఔట్ చేశాడు. 171 ప‌రుగుల వ‌ద్ద 27 ప‌రుగులు చేసిన హెడ్‌ను రాబిన్స‌న్ ఔట్ చేశాడు. ఆస్ట్రేలియా స్కోర్ 181 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా హాఫ్ సెంచ‌రీతో రాణిస్తున్న ఓపెన‌ర్ మార్క‌స్ హ‌రీస్‌ను అండ‌ర్స‌న్ ఫెమిలియ‌న్ చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 181 ప‌రుగుల 6 వికెట్లు కోల్పోయింది. 76 ప‌రుగులు హ‌రీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

భారీగా న‌మోద‌వుతున్న క‌రోనా కేసులు

విక్టోరియాలో 57,818 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 1,999 కొత్త పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. న్యూసౌత్ వేల్స్ 48,000 కంటే ఎక్కువ పరీక్షల నిర్వ‌హించ‌గా 6,324 కరోనావైరస్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Story first published: Monday, December 27, 2021, 10:10 [IST]
Other articles published on Dec 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+