
యాషెస్ సిరీస్ 2021-2022లో ఇంగ్లండ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి మూడు టెస్టుల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. దీనికి తోడు ఆ జట్టు సహాయక బృందంలోని ఏడుగురు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వారిలో ముగ్గురు సహాయక బృందంలోని వారు కాగా.. మిగతా నలుగురు వారి కుటుంబసభ్యులు. అయితే జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌కు మరో గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కుటుంబంలో ఒకరు కరోనా బారిన పడ్డారు. కుటుంబసభ్యులతో సన్నిహితంగా ఉండడంతో సిల్వర్‌వుడ్‌ను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నెల 29న నిర్వహించిన పరీక్షల్లో ఆయన పాజిటివ్‌గా తేలింది.
దీంతో ఆయన 10 రోజులపాటు ఐసోలేషన్‌లోనే ఉండనున్నారు. కనుక జనవరి 5 నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ అందుబాటులో ఉండడం లేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటింది. దీంతో ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో వరుస ఓటములతో సతమవుతున్న ఇంగ్లండ్ జట్టు సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో హెడ్ కోచ్ సేవలు లేకుండానే ఆడనుంది. కొన్ని నెలల క్రితం ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఐదో టెస్టు మ్యాచ్‌కు ముందు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. రవిశాస్త్రితోపాటు కోచింగ్ స్టాఫ్‌లోని మరి కొందరికి కూడా కరోనా సోకింది. దీంతో ఆ టెస్ట్ మ్యాచ్ రద్దయింది.
మరోవైపు యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కనీస పోటీ ఇవ్వలేకపోతున్న ఇంగ్లండ్ జట్టుపై అంతట విమర్శల వర్షం కురుస్తోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు తమ జట్టు ఆట తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరైదే ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లందరినీ తొలగించి కొత్త ఆటగాళ్లను తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్ రూట్‌ను కూడా తప్పించాలని మండిపడుతున్నారు. రూట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. కెప్టెన్‌గా రూట్ రాణించ లేకపోతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాషస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను బ్యాటింగ్ సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. కెప్టెన్ రూట్ మినహా ఎవరూ బ్యాటింగ్ రాణించలేకపోతున్నారు. ఈ ఏడాది మొత్తంలోనే ఇంగ్లండ్ జట్టులో రూట్ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు.