ధావన్, శ్రేయస్, రుతురాజ్‌తో సహా టీమిండియాలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం భారత క్రికెట్ జట్టుపై కూడా పడింది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్న టీమిండియాలోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు కరోనా పడ్డారు. వీరితోపాటు సహాయక సిబ్బందిలోని మరో ఐదుగురికి పాజిటివ్‌గా తేలినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా టీమిండియాతోపాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. కాగా దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ధావన్, శ్రేయస్‌కు పాజిటివ్
రోజువారి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో టీమిండియా స్టార్ ప్లేయర్లు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌కు పాజిటివ్‌కు నిర్దారణ అయింది. వీరితోపాటు జట్టు సహాయక బృందలోని మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే వారి పేర్లు మాత్రం బయటికి రాలేదు. మొత్తంగా భారత జట్టులోని 8 మందికి కరోనా సోకింది.
వైరస్ బారిన పడిన 8 మందిని సపరేటుగా ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నేడు పరిస్థితిని సమీక్షించిన తర్వాత బీసీసీఐ అధికారికంగా నిర్దారించే అవకాశాలు ఉన్నాయి. ఇక ధావన్, రుతురాజ్, అయ్యర్ కరోనా బారిన పడడంతో సిరీస్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన రిషి ధావన్, షారూఖ్ ఖాన్, సాయి కిషోర్ జట్టులో చేరడం లాంఛనమే అని చెప్పుకోవాలి.

క్వారంటైన్‌లో టీమిండియా
వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం నిబంధనల్లో భాగంగా టీమిండియా ఈ నెల 1 నుంచి అహ్మదాబాద్‌లో క్వాంరటైన్‌లో ఉంటుంది. ఈ క్వారంటైన్‌లో ఆటగాళ్లతోపాటు జట్టు సహాయక బృందం కూడా ఉంటుంది. నిబంధనల ప్రకారం 3 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. అయితే తాజాగా 8 మందికి వైరస్ సోకడంతో టీమిండియా క్వారంటైన్ నిబంధనలను మరింత కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. నేడు కూడా టీమిండియా ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

సిరీస్‌పై ప్రభావం
టీమిండియాలో 8 మందికి కరోనా సోకడంతో ఆ ప్రభావం భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌పై పడే అవకాశం ఉంది. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా ఇప్పటికే భారత్ చేరుకుని అహ్మదాబాద్‌లో క్వారంటైన్‌లో ఉంటుంది. తాజాగా ఆటగాళ్లకు కరోనా సోకిన కారణంగా సిరీస్ ఆలస్యంగా ప్రారంభమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే దీనిపై నేడు బీసీసీఐ స్పందించే అవకాశం ఉంది. దీంతో సిరీస్ నిర్వహణపై ఓ క్లారిటీ రానుంది.

6 నుంచి వన్డే సిరీస్
షెడ్యూల్ ప్రకారం భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 6 నుంచి అహ్మదాబాద్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 6, 9, 11వ తేదీల్లో వన్డే సిరీస్ జరగనుండగా.. 16, 18, 20వ తేదీల్లో కోల్‌కతా వేదికగా టీ20 సిరీస్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications