Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్సన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన డుప్లెసిస్ (Video)

అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్‌‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఫైనల్‌కు చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌లో జరిగిన ఛాలెంజర్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ షోతో సత్తాచాటి పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో శాన్‌ఫ్రాన్సిస్కో తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవరల్లో ఆరు వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 101 పరుగులు చేశాడు. తొమ్మిది ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. జోస్ ఇంగ్లిష్ (37; 25 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), హసన్ ఖాన్ (27 నాటౌట్; 15 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.

Corey Anderson s Spectacular One-Handed Catch in MLC-2024 Watch

అనంతరం భారీ ఛేదనకు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. డెవాన్ కాన్వే (62; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రోంప్ (56 నాటౌట్; 36 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో పోరాడారు. డుప్లెసిస్ (45; 22 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే జోరు మీదున్న డుప్లెసిస్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో కెప్టెన్ కోరె అండర్సన్ స్టన్నింగ్స్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. క్రామీ వేసిన స్లో వైడ్ డెలివరీని డుప్లెసిస్ షాట్‌కు యత్నించాడు. మిడాఫ్‌లో ఉన్న అండర్సన్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డుప్లెసిస్ కాసేపు క్రీజులో ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. డుప్లెసిస్ తర్వాత వచ్చిన బ్యాటర్లు క్రీజులో నిలవకపోవడంతో టెక్సాస్ స్కోరు వేగం తగ్గింది. ఆఖర్లో ట్రోంప్-కాన్వే గొప్పగా పోరాడినప్పటికీ జట్టు విజయం సాధించలేకపోయింది.

Story first published: Saturday, July 27, 2024, 12:07 [IST]
Other articles published on Jul 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+