హైదరాబాద్: ఇంకా కేవలం 100 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఈ క్రమంలో 2018లో జరగనున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ఎంపిక చేసింది.
ఈ మేరకు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో ఈ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. 12వ సారి జరుగుతున్న ఈ వరల్డ్ కప్ టోర్నీకి న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి.
న్యూజిలాండ్‌లోని నాలుగు ప్రధాన పట్టణాల్లో ఉన్న ఏడు వేదికల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా, కోరీ ఆండర్సన్ 2008లో మలేషియాలో, 2010లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌ల్లో ఆడాడు. రెండు టోర్నీల్లో 10 మ్యాచ్‌లాడిన ఆండర్సన్ 324 పరుగులు చేశాడు.

ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. కాగా, ఐసీసీ ప్రతిష్టాత్మక అండర్-19 వరల్డ్ కప్ టోర్నీకి అంబాసిడర్‌గా ఎంపిక చేయడంపై అండర్సన్ హర్షం వ్యక్తం చేశాడు. 'అండర్-19 వరల్డ్ కప్‌లో మరోసారి భాగస్వామి కావటం ఎంతో ఆనందంగా ఉంది. 2008, 2010లో అండర్-19 ప్రపంచకప్‌లో ఆడాను. ఇప్పుడు అదే టోర్నీకి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను' అని అండర్సన్ తెలిపాడు.
ఈ మెగా టోర్నీలో మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు. 16 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్-బిలో భారత్, ఆస్ట్రేలియా, పీఎన్‌జీ, జింబాబ్వే ఉన్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా ఇప్పటి వరకు మూడు సార్లు అండర్-19 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది.