For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రియురాలి కోసం.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌!!

Corey Anderson announce retirement from international cricket

ఆక్లాండ్‌: ప్రియురాలి కోరిక మేరకు న్యూజిలాండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శనివారం అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రియురాలు, తనకు కాబోయే భార్య కోరిక మేరకు కివీస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి.. అమెరికాలో మేజర్‌ లీగ్‌ క్రికెట్ ‌(ఎంఎల్‌సీ)‌‌లో ఆడనున్నట్లు 29 ఏళ్ల అండర్సన్‌ తెలిపాడు. కివీస్‌ తరపున అండర్సన్ చివరిసారిగా 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడు అమెరికాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.

గర్వంగా ఫీలవుతున్నా:

గర్వంగా ఫీలవుతున్నా:

'ఇంతకాలం న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా కొనసాగినందుకు చాలా గౌరవంగా ఉంది. ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. కివీస్‌ జట్టుకు సేవలు అందించినందుకు సంతోషంగా ఉన్నా. ఇన్నిరోజులు నాకు అండగా నిలిచిన కివీస్‌ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కివీస్ తరపున ఇంకా ఆడాలనుంది. అయితే ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అదే సరైన సమయమని భావించాలి' అని కోరె అండర్సన్ అన్నట్టు క్రిక్‌బజ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

 అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించా:

అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించా:

'నా ప్రియురాలు, కాబోయే భార్య మేరీ మార్గరేట్‌ అమెరికాలో ఉంటుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. అమెరికాలోని యూఎస్‌ మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడాలని మార్గరేట్‌ కోరడంతో కాదనలేకపోయా. అందుకే కివీస్‌ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. నాకు నేను చాలా ప్రశ్నలు వేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా లేదా రాబోయే రెండేళ్లలో, ఐదేళ్ల, 10 సంవత్సరాలలో నేను ఏం సాధించాలనుకుంటున్నా? లాంటి ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. ఆమె నా కోసం చాలా త్యాగం చేసింది. చాలా కఠినమైన సమయాల్లో నాకు అండగా నిలిచింది. ఆమె కోసం ఏదైనా చేయాల్సిన సమయం వచ్చింది' అని కోరె తెలిపాడు.

అత్యంత వేగంగా సెంచరీ:

అత్యంత వేగంగా సెంచరీ:

వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కోరె అండర్సన్‌ రికార్డు సాధించాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన అండర్సన్..‌ అప్పటివరకు షాహిద్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత 2015లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించి ఆ రికార్డును తిరగరాశాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా 29 ఏళ్ల కోరె కివీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

49 వన్డేల్లో 1109 పరుగులు:

49 వన్డేల్లో 1109 పరుగులు:

కోరె అండర్సన్ తన కెరీర్‌లో 13 టెస్టుల్లో 683 పరుగులు, 49 వన్డేల్లో 1109 పరుగులు, 31 టీ20ల్లో 485 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే టెస్టుల్లో 16, వన్డేల్లో 60, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. అండర్సన్‌ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎక్కువ భాగం గాయాలతో సతమతమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ , ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

'11 ఏళ్లయినా.. జడేజాను ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారు'

Story first published: Saturday, December 5, 2020, 18:32 [IST]
Other articles published on Dec 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+