ఒక్కోసారి కుటుంబం కోసం మన జీవితాల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. మన ఆశలు, ఆశయాలను పక్కన పెట్టేసి కుటుంబాన్ని పోషించే ఉద్యోగంలో చేరిపోతాం. ఇలా తమ కోరికలను చంపుకునే కుర్రాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఎప్పుడో ఒకసారి చిన్న అవకాశం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తూ ఉంటారు.
అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ భటి దూర్జన్ సింగ్. పోలీసు అధికారిగా ప్రశంసలు పొందే అతను.. తాజాగా క్రికెట్ ప్రాక్టీస్‌లో ప్రత్యక్ష్యం అయ్యాడు. మరోసారి పాత రోజులు గుర్తుకు రావడంతో యూనిఫాంలోనే నెట్స్‌లో పేస్ బౌలింగ్ చేశాడు. పర్‌ఫెక్ట్ యాక్షన్‌తో అతను వేసిన ఫాస్ట్ బౌలింగ్ చూసిన బ్యాటర్లు షాకయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంది. 'హలో 100.. నిప్పులు చెరిగే పేస్ గురించి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఎంఐ షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా దూర్జన్ సింగ్ పేస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
తను వేసిన రెండో బంతికే అతను బ్యాటర్‌ను ఏమార్చి వికెట్లను కూల్చడం వీడియోలో కనిపిస్తోంది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ కూడా కుటుంబం కోసం ఖాకీ వేసినా.. క్రికెట్ ఆడాలనే కోరిక అతనిలో ఇంకా ఉందని అంటున్నారు. కుదిరితే ఇలాంటి ఆటగాళ్లను ఐపీఎల్ ఆడించాలంటూ సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనా దూర్జన్ సింగ్.. తన పేస్‌తో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడనే చెప్పాలి.
ఈ వీడియోను దూర్జన్ సింగ్ కూడా తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. దూర్జన్ కూడా తన చిన్నతనంలో క్రికెటర్‌గా ఎదగాలని కలలు కని ఉంటాడని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా పోలీస్ అయ్యుంటాడని భావిస్తున్నారు. ఏదేమైనా దూర్జన సింగ్ తన సూపర్ పేస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడనే చెప్పాలి.