'సచిన్ టెండుల్కర్‌ను అతను దాటేసినా ఆశ్చర్యంలేదు'
ముంబై: ఇంగ్లాండ్ ఆటగాడు అలిస్టర్ కుక్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న మొత్తం పరుగుల రికార్డును కూడా దాటేస్తాడేమోనని మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. అత్యంత చిన్న వయస్సులో టెస్టుల్లో 10వేల మైలురాయి దాటిన కుక్.. సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు. ముందుముందు సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డును కూడా అతను దాటేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నాడు. సచిన్ 15,921 పరుగులతో రికార్డు ఉన్నాడు.

ఇంగ్లాండ్ ఏటా కనీసం పదకొండు, పన్నెండు టెస్టులు ఆడుతుందని, ఇది అలిస్టర్ కుక్‌కు కలిసొచ్చే అంశమని చెప్పాడు. ఒక్కో మ్యాచ్‌కు 50 పరుగులు చేసినా ఏడాదికి 500 పరుగులు ఖాతాలో చేరుతాయన్నాడు. కాబట్టి రాబోయే ఆరేడేళ్లలో కుక్ ఏదైనా సంవత్సరం చాలా బాగా ఆడి 1000 పరుగులు చేయగలిగితే సచిన్ రికార్డును అందుకోవడానికి అతడికి అవకాశముందన్నాడు. కుక్‌కు వయసు కూడా ఉందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications