ఈ రేంజ్‌లో చెలరేగితే ఎట్టా - రోహిత్ సేనకు పెద్ద గండమే మరి..!!

క్రైస్ట్‌చర్చ్: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు ముక్కోణపు సిరీస్ ఆడుతోన్నాయి. ఎల్లుండి వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా మ్యాచ్‌లు సాగుతున్నాయి. ఫైనల్‌తో కలుపుకొని మొత్తం ఏడు మ్యాచ్‌లల్లో ప్రత్యర్థులు తలపడుతున్నారు. ఇందులో నాలుగు పూర్తయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్ రెండు చొప్పున విజయాలను సాధించాయి. బంగ్లాదేశ్ ఇంకా ఖాతా కూడా తెరవలేదు.
ట్రైసిరీస్‌లో
ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ చెలరేగుతోంది. ఓటమితో సిరీస్‌ను ఆరంభించిన తరువాత వేగం పుంజుకొంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది కేన్ విలియమ్సన్ టీమ్. తొలుత ఫీల్డింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ విజృంభించారు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కివీస్ బౌలర్ల ధాటికి ఏడు వికెట్లను కోల్పోయి 130 పరుగులే చేయగలిగింది పాక్. టీమ్ సౌథీ, మిఛెల్ శాంట్నర్, మిఖాయిల్ బ్రేస్‌వెల్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఈష్ సోధి ఒక్క వికెట్ తీసుకున్నాడు.
బంగ్లాపైనా..
131 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ పెద్దగా శ్రమించలేదు. ఆడుతూ పాడుతూ కొట్టి పడేసింది. పాకిస్తాన్ బ్యాటర్లు విఫలమైన అదే పిచ్ మీద ధారాళంగా పరుగులు రాబట్టుకున్నారు. 16.1 ఓవర్లల్లోనే మ్యాచ్‌ను ముగించేశారు. అదే దూకుడును ఇప్పుడు బంగ్లాదేశ్‌పైనా ప్రదర్శిస్తోన్నారు న్యూజిలాండ్ ప్లేయర్లు. ఈ సిరీస్‌లో అయిదో మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. ఏకంగా 208 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది.
దూకుడుగా బ్యాటింగ్..
అయిదు వికెట్ల నష్టానికే జట్టు స్కోరును 200లను దాటించారు బ్యాటర్లు. ఓపెనర్లు ఫిన్ అల్లెన్, డెవాన్ కాన్వే చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని అందించారు. తొలి వికెట్ నష్టానికి 45 పరుగులు చేశారు. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన ఫిన్ అల్లెన్ అవుట్ అయినా దూకుడు తగ్గలేదు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే క్రీజ్‌లో పాతుకుపోయాడు. 40 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు చేశాడు.
19 బంతుల్లోనే..
టాప్ ఆర్డర్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ ఉన్నంత సేపూ ధాటిగా ఆడాడు. 27 బంతుల్లో 34 పరుగులో చేసి, ఇబాదత్ హొస్సైన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ బంగ్లా బౌలర్ల తుక్కు రేగ్గొట్టాడు. 19 బంతుల్లోనే ఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడంటే అతని బ్యాటింగ్ స్పీడ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 60 పరుగులు చేయడానికి ఫిలిప్స్ 24 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్..
లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తడబడుతోంది. 11 ఓవర్లల్లో 97 పరుగులు చేసింది గానీ మూడు వికెట్లను కోల్పోయింది. నజ్ముల్ హొస్సైన్ శాంటో-11, లిట్టన్ దాస్-23, సౌమ్య సర్కార్-23 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కేప్టెన్ షకీబుల్ హసన్-28, హఫీఫ్ హొస్సైన్-4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ 2022 ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ అన్ లిమిటెడ్ స్పీడ్‌తో ఉండటం ప్రత్యర్థి జట్లకు ప్రమాదకర సంకేతాలను పంపించినట్టే. రోహిత్ సేన కూడా దీనికి మినహాయింపు కాదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications