Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: రోహిత్‌ను అవమానించిన ఆస్ట్రేలియా.. భారత జట్టులో చిచ్చుపెట్టేందుకేనా?

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2024-25)లో టీమిండియాకు ఇదే చివరి సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు చేరాలంటే రోహిత్ సేన ఈ సిరీస్ అత్యంత కీలకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్‌కు చేరుకోగలదు.

మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శ్రీలంక సిరీస్‌తో కలిపి ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో అయిదు విజయాలు సాధించాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైనప్పటికీ భారత్ ఫేవరేట్‌గానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బరిలోకి దిగుతోంది. 2016 నుంచి ఈ ట్రోఫీని టీమిండియానే గెలుస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత్‌దే విజయం.

Controversy Sparks as FOX Cricket Chooses Virat Kohli Over Rohit Sharma in India vs Australia 1st Test Poster

అయితే ఆస్ట్రేలియాలోని బ్రాడ్‌కాస్టర్ 'ఫాక్స్ క్రికెట్' ఈ సిరీస్‌కు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. పోస్టర్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు విరాట్ కోహ్లి ఉన్నాడు. సాధారణంగా పోస్టర్‌పై ఇరు జట్ల కెప్టెన్లు ఉంటారు. కొన్ని సందర్భాల్లో కెప్టెన్లతో పాటు స్టార్ ప్లేయర్లూ ఉండే పోస్టర్లు ఉన్నాయి. కానీ ఓ జట్టు తరఫున కెప్టెన్, మరో జట్టు తరఫున స్టార్ ప్లేయర్ ఉండటం బహుశా ఇదే ప్రథమం.

మరోవైపు పోస్టర్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంపై మిశ్రమ స్పందన వస్తుంది. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లికే అభిమానులు ఎక్కువ ఉంటారని, టీఆర్‌పీకి కోహ్లినే ప్రధాన ఆకర్షణ అని.. అందుకే కోహ్లి పోస్టర్‌ను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్ విడుదల చేసి ఉంటుందని అంటున్నారు. మరికొందరు రోహిత్‌‌ను ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్ అవమానించిందని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాలో చిచ్చు పెట్టేందుకే ఆస్ట్రేలియా ఇలాంటి వ్యూహాలు చేస్తుందని మరికొందరు తమ వాదన వినిపిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.30)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్.

తొలి టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.

Story first published: Sunday, November 10, 2024, 12:09 [IST]
Other articles published on Nov 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+