న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్లో వివాదం: ఠాకూర్ అత్యుత్సాహం, అంఫైర్‌కు రోహిత్ ఫిర్యాదు

Controversy in IPL 2019 Final: Rohit Sharma upset after Shardul Thakurs rude send-off act

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌ 17 బంతుల్లో 29(4 ఫోర్లు)ను ఔట్ చేసిన క్రమంలో శార్దూల్ ఠాకూర్ వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

డికాక్‌ వైపు వేలు చూపిస్తూ అతడు ప్రదర్శించిన హావభావాలపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో డీకాక్ మూడు సిక్సులు బాది 20 పరుగులు రాబట్టాడు.

ఐదో ఓవర్ నాలుగో బంతికి సిక్సర్

ఐదో ఓవర్ నాలుగో బంతికి సిక్సర్

ఆ తర్వాత శార్దూల్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే డికాక్‌ను వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో డీకాక్ ఔట్ కావడంతో శార్దూల్ సంతోషం పట్టలేకపోయాడు. "నా బౌలింగ్‌లోనే సిక్సర్ కొడతావా?" అన్నట్టు డికాక్ వైపు వేలు చూపిస్తూ పెవిలియన్‌కు వెళ్లూ అంటూ సైగ చేశాడు.

చరిత్ర సృష్టించిన ముంబై

చరిత్ర సృష్టించిన ముంబై

కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు.

ఆఖరి ఓవర్‌లో మలింగ మ్యాజిక్

ఆఖరి ఓవర్‌లో మలింగ మ్యాజిక్

ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్‌ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్‌ ఓవర్‌ ఖాయమేనని అనుకున్నారు. అయితే, చివరి బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ వికెట్‌ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు.

Story first published: Monday, May 13, 2019, 13:29 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X