
మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం
1998లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఓ బుకీ వద్ద షేన్ వార్న్ డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. పిచ్, వాతావరణ పరిస్థితుల గురించి ఓ బుకీతో వార్న్ మాట్లాడినట్టు వచ్చిన వార్తలు అప్పట్లో పెను దుమారాన్ని లేపాయి. ఇక 1999 ప్రపంచకప్ సమయంలో శ్రీలంక కెప్టెన్ రణతుంగను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ ప్రపంచకప్‌లో వార్న్‌పై రెండు మ్యాచ్‌లు ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.

డ్రగ్స్ వివాదం
2003 వరల్డ్ కప్ సమయంలో షేన్ వార్న్ డ్రగ్స్ తీసుకున్నాడని డోపింగ్ టెస్టులో తేలింది. దీంతో అతడిపై వరల్డ్‌కప్ ఆడకుండా వేటు వేశారు. ఇక 2013లో బిగ్‌బాష్ లీగ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ 4,500 డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. ఇవే కాకుండా లైంగిక సంబంధాల విషయంలోనూ షేన్ వార్న్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

లైంగిక సంబంధాల ఆరోపణలు
షేన్ వార్న్‌కు అనేక మంది మహిళలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. 2006లో మహిళలతో కలిసి అండర్ వేర్‌లతో వార్న్ దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇవి వార్న్ ప్రతిష్టను మరింతగా దిగజార్చాయి. ఇక వార్న్ వైవాహిక జీవితం కూడా ఏం అంతా సాఫీగా లేదు.
వైవాహిక జీవితంలో మూడు వివాహాలు చేసుకున్నాడు. అతని భార్య సిమోన్ వార్న్ నుంచి దూరంగా వెళ్లిపోయింది. 2007లో మళ్లీ కలిసినప్పటికీ నటి ఎలిజిబెత్ హార్లీతో వార్న్ నిశ్చితార్ధం దాకా వెళ్లడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది.

షేన్ వార్న్ రికార్డులు
5 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో మైలు రాళ్లను సాధించారు. తన లెగ్ స్పిన్‌తో బ్యాటర్లను ముప్ప తిప్పలు పెట్టారు. స్పిన్ బౌలింగ్ అంటే షేన్ వార్నే అనేంతగా క్రికెట్‌ను ఎలారు. కెరీర్లో 145 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. ఇక 194 వన్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు తీశాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి వెయ్యి వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్న్ తొలి సీజన్‌లోనే ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
షేన్ వార్న్ కెరీర్లో గొప్పి ఇన్నింగ్స్‌ల్లో 1999 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్స్ , ఫైనల్‌లో బ్యాక్-టు-బ్యాక్ ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. అలాగే ఇంగ్లండ్‌పై ఐదు యాషెస్ సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications












