హైదరాబాద్: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. కేరళలోని తిరువనంతపురంలో శ్రీశాంత్ భార్య భువనేశ్వరి బేబి గర్ల్‌కి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రీశాంత్ తన ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించాడు.
మదర్స్ డే రోజున మా ఇంట్లో బుల్లి పాప నవ్వులు వినబడటం ఎంతో ఆనందంగా ఉందంటూ శ్రీశాంత్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని తెలిపాడు.
రాజస్ధాన్‌లోని రాజకుటుంబానికి చెందిన శ్రీశాంత్ 2013, డిసెంబర్‌లో జైపూర్‌కు చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శ్రీశాంత్ టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 ట్వంటీ 20 మ్యాచ్‌లను ఆడాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొవడంతో శ్రీశాంత్ క్రీడా జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కేరళ నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన రెండో ఆటగాడు శ్రీశాంత్ కావడం విశేషం.