Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్ హైదరాబాద్ క్యాంప్‌లో కలకలం: ప్లేయర్ల నిరసన: బీసీసీఐ వద్దకు పంచాయితీ

Controversial catch of Kane Williamson against RR, has prompted Sunrisers Hyderabad to lodge a protest

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి మ్యాచ్‌ కలిసి రాలేదు. ప్రత్యర్థికి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని ఇచ్చుకోవడం, అనంతరం దాన్ని ఛేదించలేక చతికిల పడటం- అన్నింటికీ మించి కేప్టెన్ కేన్ విలియమ్సన్ వివాదస్పదంగా పెవిలియన్ దారి పట్టడం.. వెరసి అశుభ సంకేతాన్ని పంపించినట్టయింది. మున్ముందు ఇంకా కఠిన సవాళ్లు, మ్యాచ్‌లను ఎదుర్కోవాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ అనిశ్చిత వాతావరణాన్ని ఎదుర్కొంటోందీ కేన్ విలియమ్సన్ టీమ్.

పాయింట్ల పట్టికలో..

రాజస్థాన్‌ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులతో హైదరాబాద్‌ ఓడిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. దాన్ని ఛేదించలేకపోయింది సన్‌రైజర్స్. 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ తేడాతో ఓటమిపాలు కావడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. తన తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొనబోతోంది. సోమవారం నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ షెడ్యూల్ అయింది.

రాయల్స్ బ్యాటర్ల జోరు..

ఫుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కెప్టెన్ సంజు శాంసన్-55, దేవ్‌దత్ పడిక్కల్-41, జోస్ బట్లర్-35, షిమ్రోన్ హెట్‌మైర్- 32 పరుగులు చేశారు. వీరందరి స్ట్రైక్ రేట్ 125 నుంచి 246 వరకు రికార్డయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు ఉమ్రాన్ మలిక్, టీ నటరాజన్ రెండు చొప్పున, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెప్పర్డ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కేన్ అవుట్ అయిన తీరుపై..

ఛేజింగ్ సమయంలో కేన్ విలియమ్సన్ అవుట్ అయిన విధానం వివాదాస్పదమైంది. దీనిపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. దీన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ జోక్యం చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ వద్దకు దీన్ని తీసుకెళ్లింది. తన నిరసన, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. థర్డ్ అంపైర్ నిర్ణయం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐకి ఓ లేఖ రాసింది.

గ్రౌండ్‌ను తాకినా..

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అవుట్ అయ్యాడా మ్యాచ్‌లో. ఆరు బంతులకు రెండు పరుగులు చేసిన విలియమ్సన్.. ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన హైపిచ్ బంతిని డిఫెండ్ ఆడాడు. అది కాస్తా కుడివైపు స్లిప్స్‌లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ కమ్ కేప్టెన్ సంజు శాంసన్ కుడివైపునకు డైవ్ చేసినప్పటికీ.. దాన్ని అందుకోలేకపోయాడు. తొలుత అతిన గ్లోవ్స్‌లో పడి మళ్లీ గాల్లోకి లేచిన ఆ బంతిని స్లిప్స్‌లో ఉన్న దేవ్‌దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. అతని చేతుల్లోకి వెళ్లకముందే ఆ బాల్ గ్రౌండ్‌ను తాకిందనేది రీప్లేలో స్పష్టంగా కనిపించింది.

థర్డ్‌ అంపైర్ అవుట్ ఇవ్వడంపై..

థర్డ్‌ అంపైర్ అవుట్ ఇవ్వడంపై..

పిచ్ అయి లేచిన తరువాత బంతిని పడిక్కల్ అందుకున్నాడనేది రీప్లేలో స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదాన్ని రేపింది. దీనిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ స్పందించింది. బీసీసీఐకి లేఖ రాసింది. తన అభ్యంతరాన్ని తెలియజేసింది. వీడియో క్లిప్స్, వివిధ కోణాల్లో నుంచి తీసిన ఫొటోలు, కేప్టెన్ రిపోర్ట్‌ను తన లేఖకు జత చేసింది. తమ జట్టు కేప్టెన్ అవుట్‌పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. లేఖ రాసిన విషయాన్ని హెడ్ కోచ్ టామ్ మూడీ నిర్ధారించారు.

Story first published: Saturday, April 2, 2022, 7:25 [IST]
Other articles published on Apr 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+