For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్ పట్ల ఎంతో గర్వంగా ఉన్నా' - బాడీ షేమింగ్‌పై షామా మేడమ్ యూటర్న్!!

టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మపై కాంగ్రెస్‌ నాయకురాలు షామా మహమ్మద్‌ బాడీషేమింగ్‌కు పాల్పడటం తీవ్ర దుమారం రేపుతోంది. శమా చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ గొడవగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శమా మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించారు. తాను చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నారు! మీడియా ముందు దిద్దుబాటు చర్యలకు దిగారు.

అతడి పట్ల గర్వంగా ఉన్నా..షామా
మీడియా శమాను చుట్టుముట్టి ఆమె చేసిన కామెంట్స్ పై ప్రశ్నించగా.. "ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నా పార్టీని ఇందులోకి లాగొద్దు. ఓ విషయం గురించి మాట్లాడే స్వేఛ్ఛ మనకు ఉంది కదా. అదే నేను చేశాను. నేను కేవలం ఓ వ్యక్తి ఫిట్ నెస్ గురించి మాత్రమే మాట్లాడను. ఎవరినీ కించపరచలేదు. నేను రోహిత్ శర్మ పట్ల ఎంతో గర్వంగా ఉన్నాను." అని షామా తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. అంతకుముందు కూడా "నేను రోహిత్ గురించి కేవలం సాధారణ కోణంలోనే మాట్లాడాను.ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు కూడా మాకు లేదా?" అని అన్నారు.

Congress leader shama mohammed uturn on rohit body shaming comments says she proud of Rohit Sharma

స్పందంచిన కాంగ్రెస్..
ఈ గొడవ పెద్దది కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. షామా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. షామా వ్యాఖ్యలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు అని వెల్లడించంది.

ఫ్యాషన్ షోకు వెళ్లండి..
దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. క్రికెట్‌కు స్లిమ్ బాడీ అవసరం లేదని, నాణ్యమైన ఆటతీరు ఉంటే చాలని అన్నాడు. స్లిమ్‌గా ఉండేవాళ్లను కోరుకుంటే.. క్రికెట్ చూడటం మానేసి ఫ్యాషన్ షోలకు వెళ్లాలని సూచించాడు.

Story first published: Tuesday, March 4, 2025, 10:01 [IST]
Other articles published on Mar 4, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+