Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విష్ చేయబోయి పప్పులో కాలేసిన కాంగ్రెస్

Congress brutally trolled on Twitter for error in tweet lauding Indias thumping series win over West Indies

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌ను విజయంతో ముగించుకొన్న టీమిండియా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో పోరాడింది. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

హైదరాబాద్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో

రెండో టెస్టులో భాగంగా జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోహ్లి సేన ఈ రెండు మ్యాచ్‌లనూ మూడు రోజుల్లోనే ముగించడం విశేషం. హైదరాబాద్‌ టెస్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్టులో అరంగ్రేటం చేసిన పృథ్వీ..సెంచరీ బాదాడు. రెండో టెస్టులోనూ హాఫ్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు.

ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల వెల్లువ

ఈ క్రమంలో టీమిండియా విజయం పట్ల ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. విండీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లి సేనను అభినందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కానీ ఆ ట్వీట్లో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆ పార్టీ నవ్వులపాలైంది. తెల్లటి దుస్తుల్లో క్రికెట్ ఆడిన ఫొటో పెట్టి ‘విండీస్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన మెన్ ఇన్ బ్లూకి అభినందనలు'అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

మెన్ ఇన్ బ్లూ అనడంతో నెటిజన్ల చురకలు

జట్టుకు శుభాకాంక్షలు చెప్పే తొందరలో.. మెన్ ఇన్ బ్లూ అనడంతో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. టెస్టు జట్టును మెన్ ఇన్ బ్లూ అని ఎలా అంటారు..? వన్డే, టీ20ల్లో తలపడే టీమిండియాను మెన్ ఇన్ బ్లూ అంటారు. టెస్టుల్లో ఏ జట్టయినా ధరించేది తెల్లటి వస్త్రాలే కదా? అని క్రికెట్ ప్రేమికులు నిలదీస్తున్నారు.

అంధత్వానికి రెండు నిమిషాలు మౌనం

కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ వర్ణ అంధత్వానికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని పంచ్‌లేస్తున్నారు. డియర్ రాహుల్ గాంధీ టెస్టు మ్యాచ్‌లను వైట్ యూనిఫాంలో ఆడుతారని కాంగ్రెస్ చీఫ్‌ను ట్యాగ్ చేసి ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Monday, October 15, 2018, 16:45 [IST]
Other articles published on Oct 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+