Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముహుర్తం కుదిరింది: నవంబర్ 27న జహీర్‌ ఖాన్, సాగరికల పెళ్లి

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్‌ ఖాన్‌, బాలీవుడ్‌ నటి సాగరిక ఘట్గేలు ఈ నవంబరులో పెళ్లి చేసుకోనున్నారు. జాతీయ న్యూస్ ఛానెల్స్‌లో వస్తున్న వివరాల ప్రకారం నవంబరు 27న తేదీన వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వీళ్లిద్దరూ పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు.

వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, స్నేహితులే హాజరుకానున్నారు. వివాహం అనంతరం ముంబై, పుణెలో జహీర్‌ దంపతులు సన్నిహితులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ నిర్వహించనుంది. ఈ వివాహ రిసెప్షన్‌‌కు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా హాజరు కానున్నారు.

Confirmed: Sagarika Ghatge and Zaheer Khan to tie the knot on November 27

ఇందుకు సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగరికతో నిశ్చితార్థం జరిగినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ట్విటర్‌ ద్వారా జహీర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ ఒకరినొకరిని ప్రేమించుకోవడం ప్రారంభించారు.

చివరకి వీరి ప్రేమాయణానికి ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌తో పుల్ స్టాప్ పెట్టారు. ఐపీఎల్‌ జరిగే సమయంలో ఒక రోజు జహీర్‌.. సాగరికను గోవా తీసుకెళ్లి ప్రపోజ్‌ చేశాడు. జహీర్‌ ఖాన్ లవ్ ప్రపోజల్‌ను సాగరిక అంగీకరించడంతో ఐపీఎల్‌ అనంతరం వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+