Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అధికారికం: మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై బయోపిక్?

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజాలైన మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇప్పుడు మహిళాల వన్డే క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ జీవితక‌థ ఆధారంగా సినిమాను రూపొందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మిథాలీ రాజ్ జీవిత‌క‌థ‌కు సంబంధించిన హ‌క్కుల‌ను ఇటీవ‌ల ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ వ‌యోకామ్‌ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ వారు సొంతం చేసుకున్నారు. మ‌హిళా క్రికెట్లో స‌చిన్ టెండూల్క‌ర్‌గా పిలిచే మిథాలీ రాజ్ జీవిత‌క‌థ హ‌క్కులు ద‌క్కించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని వ‌యోకామ్18 ప్ర‌తినిధి అజిత్ అంధారే తెలిపారు.

ఈ చిత్రాన్ని అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలి

ఈ చిత్రాన్ని అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకోవాలి

ఈ చిత్రాన్ని అమ్మాయిలు స్ఫూర్తిగా తీసుకుని ఆట‌ల్లో రాణించాల‌ని కోరుకుంటున్న‌ట్లు మిథాలీ వెల్ల‌డించడం విశేషం. ఇక, ప‌ద‌హారేళ్ల వ‌య‌సులో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకుని, వ‌న్డేల్లో సెంచ‌రీ చేసిన చిన్న‌వ‌యస్కురాలిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లింది.

వరల్డ్ కప్ ఫైనల్లో రన్నరప్‌గా

వరల్డ్ కప్ ఫైనల్లో రన్నరప్‌గా

పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించింది. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించింది.

6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌

6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌

అత్యధిక పరుగులతో పాటు వన్డే క్రికెట్‌లో 6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌ కూడా మిథాలీనే. 16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసింది. ఇప్ప‌టికీ అత్యంత పిన్న వ‌య‌సులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం.

టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌

టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌

19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా పాకిస్థాన్‌కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది.

 వన్డేల్లో వ‌రుస‌గా ఏడు హాఫ్ సెంచ‌రీలు

వన్డేల్లో వ‌రుస‌గా ఏడు హాఫ్ సెంచ‌రీలు

2004లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కిరన్ 242 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గా మిథాలీ రికార్డు సృష్టించింది.

భారత మహిళా జట్టు కెప్టెన్‌గా

భారత మహిళా జట్టు కెప్టెన్‌గా

వ‌న్డే అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. స‌చిన్ కూడా స‌రిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో ప‌రుగులు చేయ‌డం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మిన‌హాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్‌గా కొనసాగుతోంది.

జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్

జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్

మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్ తీయనున్నారు. ఈ సినిమాకు 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే పేరు పెట్టారు. ఈ మేరకు ఒక సినిమాని తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ దర్శకుడు సుశాంత దాస్ తాజాగా వెల్లడించారు. అస్సాంలోని తన నదియా జిల్లా నుంచి ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల వరల్డ్ కప్‌లో జులన్ గోస్వామి అద్భుతమైన ప్రదర్శన వరకు వెండితెరపై చూపించనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+