Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ప్లే ఆఫ్ రేసు నుంచి మూడు జట్లు ఔట్, అవి ఏంటీ!

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ విజయంతో సొంతగడ్డపై తిరుగులేదని మరోసారి సన్ రైజర్స్ నిరూపించుకుంది. 139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Confirmed: 3 teams out of play-offs race in IPL 2017

బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబైపై సన్ రైజర్స్ విజయం సాధించడంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి మరో జట్టు తప్పుకుంది.

దీంతో ఐపీఎల్ పదో సీజన్‌లో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు నిలిచాయి. ఈ సీజన్‌లో ఇంకా 8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

లీగ్ స్టేజీలో బెంగళూరు (5 పాయింట్లు) ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉండగా, గుజరాత్ (8 పాయింట్లు) రెండు మ్యాచ్‌లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ (8 పాయింట్లు) మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు జట్లు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 6, 7, 8 స్ధానాల్లో ఉన్నాయి.

12 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచి ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. కోల్‌కతా రెండో స్ధానంలో ఉండగా, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మూడో స్ధానంలో కొనసాగుతోంది. రెండు జట్లు కూడా 16 పాయింట్లను కలిగి ఉన్నాయి.

15 పాయింట్లతో సన్ రైజర్స్ నాలుగో స్ధానంలో ఉంది. ఇక పంజాబ్ టాప్ 4 స్ధానంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే పంజాబ్ తొలి నాలుగు స్ధానాల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

ఈ ‌సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ 10 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. దీంతో మూడు ప్లే ఆఫ్ బెర్తుల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+