Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సులభం కాదు, దక్షిణాఫ్రికా పర్యటన కోహ్లీ సేనకు ఓ సవాల్'

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అసలైన పరీక్ష ముందు ఉందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. 2018లో కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేమ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు.

దక్షిణాఫ్రికా సిరిస్‌లో కోహ్లీ కఠిన పరీక్ష ఎదుర్కొంటాడని స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పిచ్‌ల్లో కోహ్లీ రాణించడం అంత సులభం కాదని, అదే అతని బ్యాటింగ్‌ సత్తాకు సవాల్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని స్మిత్ పేర్కొన్నాడు.

Conditions in South Africa will test Virat Kohli-led Team India, says Graeme Smith


'టెస్టు క్రికెట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. భారత విజయాల్లో కెప్టెన్ కోహ్లీ భాగస్వామ్యం అధికం. బ్యాట్‌తో రాణిస్తూ జట్టుకు వరుస విజయాల్ని అందిస్తున్నాడు. అయితే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ రాణించడం అనుకున్నంత సులభం కాదు. శ్రీలంక, కరీబియన్లలో బంతి బ్యాట్ మీదకి స్లోగా వస్తుంది. అయితే సఫారీ పిచ్‌లు అందుకు భిన్నం. ఈ నేపథ్యంలో మా గడ్డపై భారత జట్టు కఠినమైన సవాల్ ఎదుర్కోవడం ఖాయం' అని స్మిత్ తెలిపాడు.

'దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, కేశవ్ మహారాజ్‌లను కోహ్లీసేన ఎలా ఎదుర్కొంటుందో కూడా ఆసక్తికరం. మరోవైపు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులోకి డేల్ స్టెయిన్ తిరిగొచ్చాడు. టీమిండియాపై అంటే స్టెయిన్‌కు మంచి రికార్డు ఉంది' అని స్మిత్ పేర్కొన్నాడు.

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదని అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ ఏబీ డివిలియర్స్ తీసుకున్న నిర్ణయాన్ని స్మిత్ స్వాగతించాడు. అదే సమయంలో డు ప్లెసిస్‌కు వన్డే కెప్టెన్సీని అప్పచెబితే బాగుంటుందన్న డివిలియర్స్ అభిప్రాయాన్ని స్మిత్ సమర్ధించాడు.

టెస్టుల్లో, టీ 20ల్లో అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్న డు ప్లెసిస్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మానసికంగా జట్టు పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+