Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంక్లిష్టమైన టెక్నిక్, ఓ క్రమపద్ధతిలో ఆలోచించే విధానం: స్మిత్ విజయం రహస్యం వెల్లడి

Complicated technique but an organised mindset sets Steve Smith apart, says Sachin Tendulkar

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తొలి టెస్టులో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్ గురువారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు.

టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌కు ఇది 26వ సెంచరీ. ఈ క్రమంలో అనేక రికార్డులను స్టీవ్ స్మిత్ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో 26వ సెంచరీ అందుకున్న స్మిత్‌ క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను సైతం అధిగమించాడు. ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు.

స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు సాధించగా

స్టీవ్ స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు సాధించగా... సచిన్ టెండూల్కర్ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. తన రికార్డుని అధిగమించిన నేపథ్యంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో స్టీవ్ స్మిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. స్మిత్ డబుల్ సెంచరీ చేసిన ఫోటోను పోస్టు చేస్తూ "సంక్లిష్టమైన టెక్నిక్, ఓ క్రమపద్ధతిలో ఆలోచించే విధానం స్మిత్‌ను మిగతా క్రికెటర్ల కంటే భిన్నంగా నిలుపుతోంది" అంటూ కామెంట్ పెట్టాడు.

వరుసగా ఎనిమిది సార్లు 50కిపైగా స్కోర్లు

వరుసగా ఎనిమిది సార్లు 50కిపైగా స్కోర్లు

ఏడాది నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తన పునరాగమనాన్ని స్టీవ్ స్మిత్ ఘనంగా చాటాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. యాషెస్‌లో వరుసగా ఎనిమిది సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసిన ఆస్ట్రేలియా

తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసిన ఆస్ట్రేలియా

యాషెస్ సిరిస్‌లో గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 239, 76, 102 నాటౌట్, 83, 144, 142, 92, 211 పరుగులు సాధించాడు. నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ రోజు ముగిసేసరికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది.

ఈ సిరిస్‌లో ఇప్పటికే 589 పరుగులు

ఈ సిరిస్‌లో ఇప్పటికే 589 పరుగులు

యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌ తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టుకు దూరమయ్యాడు. నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీతో సాధించాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించాడు.

Story first published: Friday, September 6, 2019, 14:35 [IST]
Other articles published on Sep 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+