Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : అచ్చం కోహ్లీలా ఆడుతున్న కుర్ర ఓపెనర్.. లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందించడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి చక్కగా రాణిస్తున్నాడు. అతను ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 303 పరుగులు చేశాడు. వీటిలో ఐదు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.

ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్‌లో కోహ్లీ లెక్కలు చూస్తే.. 8 మ్యాచుల్లో 142.31 స్ట్రైక్ రేటుతో 303 పరుగులు చేశాడు. అంతేకాదు, ఒకసారి డకౌట్ కూడా అయ్యాడు. ఈ ఎనిమిది మ్యాచుల్లో మొత్తం 243 బంతులు ఎదుర్కొన్నాడీ స్టార్ ప్లేయర్. ఈ ఏడాది ఐపీఎల్‌లో తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ముంబైపై 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇవన్నీ చూస్తుంటే కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్‌ వైపు వెళ్తున్నట్లే ఉంది.

Virat Kohli and Shubman Gill is unreal

ఇప్పుడు మరో ప్లేయర్ కూడా ఇలాంటి గణాంకాలతోనే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. అతనెవరో కాదు.. కోహ్లీ తర్వాత భారత క్రికెట్‌లో కీలకమైన ఆటగాడిగా ఎదుగుతాడని అందరూ అనుకుంటున్న శుభ్‌మన్ గిల్. అతను కూడా ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడాడు. అంతేకాదు, అచ్చం కోహ్లీలాగే 243 బంతులు ఎదుర్కొన్నాడు. కోహ్లీ చేసినట్లే 303 పరుగులు కూడా చేశాడు.

అయితే కోహ్లీ ఐదు హాఫ్ సెంచరీలో చేస్తే.. గిల్ కేవలం మూడు హాఫ్ సెంచరీలే చేశాడు. కానీ ఇద్దరి స్ట్రైక్ రేట్ 142.31 కావడం గమనార్హం. గిల్ కూడా కోహ్లీలాగే ఒకసారి డకౌట్ కూడా అయ్యాడు. వీరిద్దరి మధ్య ఉన్న భేదాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఒకటి. కోహ్లీ తన తొలి మ్యాచ్‌లో చేసిన 82 పరుగులు ఈ సీజన్‌లో అతని బెస్ట్ స్కోరు. గిల్ బెస్ట్ స్కోరు 67 పరుగులే. ఇలా వీళ్లిద్దరి మధ్య ఇన్ని సారూప్యతలు ఉండటం చూసిన ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.

Story first published: Monday, May 1, 2023, 12:00 [IST]
Other articles published on May 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+