For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Commonwealth games 2022: గాయంతోనే రజతాన్ని సాధించిన సుశీలా దేవి.. కాంస్యంతో మెరిసిన హర్జిందర్ కౌర్

Commonwealth Games: Sushila Devi Won Silver and Harjinder Kaur Won Bronze For India

బర్మింగ్‌హామ్‌: భారత జూడో ప్లేయర్‌ సుశీలా దేవికి త్రుటిలో స్వర్ణం చేజారింది. ఓ వైపు గాయాలు ఆమెను వేధిస్తున్నా అకుంఠిత పోరాటంలో ఫైనల్లో తలపడింది. అయితే చివరకు ఆమె ఓడిపోవడంతో రజత పతకం దక్కింది. మహిళల 48కిలోల విభాగం ఫైనల్లో దక్షిణాఫ్రికా జూడో ప్లేయర్ మైకేలా వైట్‌బూ చేతిలో ఆమె పరాజయం పాలయింది. గాయమై తీవ్ర ఇబ్బంది పడ్డ సుశీల తన కుడి కాలికి నాలుగు కుట్లు వేయించుకుంది. ఇక బరిలోకి దిగి 4.25నిమిషాల పాటు మైకేలా వైట్‌బూను నిలువరించింది.

అయితే చివర్లో మైకేలా ఆధిపత్యం చలాయించింది. ఇకపోతే జూడోలోనే మెన్స్ 60కిలోల విభాగంలో వారణాసి వాసి విజయ్‌ కుమార్‌ యాదవ్‌ కాంస్యాన్ని సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కేవలం 58సెకన్లలోనే పెట్రోస్‌ క్రిస్టోడూలిడ్స్‌‌ను ఓడించాడు.

చేజారిన రెండు పతకాలు

జూడో విభాగంలో భారత్‌కు త్రుటిలో రెండు కాంస్య పతకాలు చేజారాయి. కాంస్య పతక మ్యాచ్‌‌లో మెన్స్ 66కేజీల విభాగంలో ఆస్ట్రేలియా ప్లేయర్ నాథన్‌ కట్జ్‌ చేతిలో జస్లీన్‌ సింగ్‌ సైనీ ఓడిపోయాడు. అలాగే వుమెన్స్ 57కిలోల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్‌ (మారిషస్‌) చేతిలో సుచిక తరియాల్‌ ఓడింది.

వెయిట్ లిఫ్టింగ్‌లో మరో పతకం

4వ రోజు మహిళల 71కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా భారత పతకాల సంఖ్య నాలుగో రోజు ముగిసేసరికి తొమ్మిదికి చేరుకుంది. ఆమె మొత్తం 212కిలోల బరువు ఎత్తింది. ఈ ఈవెంట్లో ఇంగ్లాండ్‌కు చెందిన సారా డేవిస్ 229 కేజీల బరువుతో స్వర్ణం సాధించగా.. కెనడాకు చెందిన యువ అలెక్సిస్ అష్‌వర్త్ మొత్తం 214కేజీల బరువుతో రజతం గెలుచుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్‌ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.

బ్యాడ్మింటన్‌ ఫైనల్లో భారత్‌

భారత్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ సెమీఫైనల్లో 3-0తో సింగపూర్‌ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. నేడు ఫైనల్లో మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 21-11, 21-12తో, పీవీ సింధు 21-11, 21-12తో, లక్ష్య సేన్‌ 21-18, 21-15తో గెలుపొంది భారత్‌ను ఫైనల్‌కు చేర్చారు. పురుషుల హాకీలో పూల్‌ 'బి' లీగ్‌ మ్యాచ్‌‌లో భారత్‌ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 4-4తో డ్రా అయింది. పురుషుల స్క్వాష్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ సెమీఫైనల్‌ చేరాడు.

ఇప్పటివరకు భారత్ తరఫున పతకాలు సాధించింది వీరే

ఇప్పటివరకు భారత్ తరఫున పతకాలు సాధించింది వీరే

వెయిట్ లిఫ్టింగ్

1. మీరాబాయ్‌ చాను 49కేజీల విభాగంలో గోల్డ్,

2. జెరెమీ లాల్రినుంగా 67కేజీల విభాగంలో గోల్డ్,

3.అచింత షెవులి 73 కేజీల విభాగంలో గోల్డ్,

4. సంకేత్ మహదేవ్ 55 కేజీల విభాగంలో సిల్వర్,

5. బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో సిల్వర్,

6. గురురాజ్ పూజారి 61కేజీల విభాగంలో బ్రాంజ్

7.హర్జిందర్ కౌర్ 71కేజీల విభాగంలో బ్రాంజ్

జూడో

8.సుశీలా దేవీ 49కేజీల విభాగంలో గోల్డ్

9.విజయ్ కుమార్ 60కిలోల విభాగంలో బ్రాంజ్

లాన్స్ బౌల్స్

10. మహిళల ఫోర్స్ లాన్స్ బౌల్స్ టీం సిల్వర్ లేదా గోల్డ్ మెడల్

Story first published: Tuesday, August 2, 2022, 8:24 [IST]
Other articles published on Aug 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+