చివరి ప్రయత్నంలో గాయపడ్డ జెరెమీ
ఇకపోతే జెరెమీ తన చివరి ప్రయత్నంలో 165 కేజీలు ఎత్తే టైంలో కాస్త గాయపడ్డాడు. అయితే పెద్ద గాయమేమీ కాదు. అందువల్ల 165కేజీల లిఫ్టింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఇక ఏదేమైతేనేం తానే లీడింగ్ స్కోరర్‌గా ఉండడంతో అతనికి గోల్డ్ వశమైంది. ఇక ఫైనల్ రౌండ్ ముగిశాక జెరెమీ గెలుపు కన్ఫామ్ కావడంతో అతనితో పాటు కోచ్‌లు సంబరాల్లో మునిగితేలారు. భారత జాతీయ గీతం ప్లే అవుతుండగా.. పసిడి పతకాన్ని పోడియం మీద అతను అందుకున్నాడు.
గత ఈవెంట్లోనూ గోల్డ్ మెడల్స్ ప్రదర్శన
మిజోరంలోని ఐజ్వాల్‌కు చెందిన 19ఏళ్ల యువకుడు అయిన జెరెమీ 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 62కిలోల ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. గత సంవత్సరం కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 67కిలోల విభాగంలో అతను స్వర్ణం కూడా గెలుచుకున్నాడు. ఇక తాజా కామన్ వెల్త్ గేమ్స్‌లో అతను స్వర్ణం సాధించి.. భారత్‌ను పతకాల లిస్టులో 8వ స్థానం నుంచి 6వ స్థానానికి చేర్చాడు. ఈ ఈవెంట్లో సమోవాకు చెందిన వెటరన్ లిఫ్టర్ వైపావ ఐయోనే 293 కేజీల బరువు ఎత్తి రజతం గెలుపొందగా, నైజీరియాకు చెందిన ఎడిడియాంగ్ ఉమోఫియా 290కేజీలతో కాంస్యం సాధించాడు. జెరెమీ తన రెండో రౌండ్లో 140కేజీల బరువు ఎత్తి తన సమీప ప్రత్యర్థి ఎడిడియోంగ్ జోసెఫ్ ఉమోఫియా కంటే 10కిలోల ఆధిక్యాన్ని కనబరిచాడు.
ప్రముఖ బాక్సర్ కుమారుడు జెరెమీ
ఇకపోతే భారత్ ఇప్పటివరకు అయిదు పతకాలు గెలుచుకుంది. మీరాబాయి చాను (స్వర్ణం), సంకేత్ సర్గర్ (రజతం), బిద్యరాణి దేవి (రజతం), గురురాజ్ పూజారి (కాంస్యం) గెలుపొందార. తాజాగా జెరెమీ (స్వర్ణం) వెయిట్‌లిఫ్టింగ్‌లోనే భారత్‌కు ఈ ఐదు పతకాలు రావడం గమనార్హం. జాతీయ స్థాయి బాక్సర్ అయిన లాల్రినుంగా కుమారుడు లాల్రిన్‌నుంగా. అతను తొలుత బాక్సింగ్ క్రీడ మీద మక్కువ చూపాడు. తర్వాత బాక్సింగ్ కాదని వెయిట్ లిఫ్టింగ్ వైపు తన ఫోకస్ మరల్చాడు. అందువల్ల వెయిట్ లిఫ్టింగ్లో ఇండియాకు మరో ఆశాకిరణంలా మారాడు.


Click it and Unblock the Notifications












