Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Commonwealth Games 2022 : టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు ఇద్దరు ఔట్..!

CommonWealth Games 2022 : Two Players Of Indian Womens Team tests Corona postitive

బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు టీమిండియా వుమెన్స్ టీంకు షాక్ తగిలింది. భారత జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడడంతో వారు ఇద్దరు లేకుండానే టీం బర్మింగ్‌హామ్ బయలుదేరింది. అయితే కోవిడ్ బారిన ఆటగాళ్ల పేర్లు టీం మేనేజ్ మెంట్ గోప్యంగా ఉంచింది. వారిద్దరు కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చాక ఇంగ్లాండ్‌ జట్టులో చేరతారు. ఇకపోతే తొలిసారి కామన్ వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ క్రికెట్ అరంగేట్రం చేస్తుంది. 1998లో మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో మెన్స్ క్రికెట్ టోర్నీ జరిగింది. అప్పుడు దక్షిణాఫ్రికా టీం గోల్డ్‌ మెడల్ సాధించింది. ఇకపోతే బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్‌, భారత్‌ ఒక గ్రూప్‌లో ఉన్నాయి.

తొలుత ఒకరు కరోనా బారిన పడ్డట్లు గంగూలీ ప్రకటన

తొలుత ఒకరు కరోనా బారిన పడ్డట్లు గంగూలీ ప్రకటన

అంతకుముందు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ఇంగ్లాండ్‌కు టీమిండియా స్క్వాడ్ బయలుదేరే ముందు బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఒక ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారత శిబిరంలో రెండో ప్లేయర్ పాజిటివ్‌గా తేలిన వార్తను భారత ఒలింపిక్ సంఘం అధికారి మంగళవారం ప్రకటించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం.. రెండో ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. భారత జట్టు బర్మింగ్ హామ్ బయలుదేరే ముందు ఈ విషయం వెలుగుచూసింది. కరోనా బారిన పడ్డ ఇద్దరు ఆటగాళ్లు భారతదేశంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

 తొలి రెండు మ్యాచ్‌లకు వాళ్లు దూరం

తొలి రెండు మ్యాచ్‌లకు వాళ్లు దూరం

ఇకపోతే భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌ల టైమ్‌లైన్ ప్రకారం.. కోవిడ్ 19 బారిన పడి ఇండియాలోనే ఉన్న ఇద్దరు టీమిండియా ప్లేయర్లు జులై 29న ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి మ్యాచ్‌కు జట్టుకు అందుబాటులో ఉండరు. అలాగే 31వ తేదీన పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా వారు అందుబాటులో ఉండడం డౌటే. ఇక భారత్ చివరి లీగ్ గేమ్ బార్బడోస్‌తో ఆగస్టు 3వ తేదీన జరుగుతుంది.

 మాస్కులు ధరించి విమానాశ్రయం నుంచి బయటకు

మాస్కులు ధరించి విమానాశ్రయం నుంచి బయటకు

ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) బర్మింగ్‌హామ్‌లోని భారత బృందానికి స్వాగతం పలికిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్లేయర్లు, సిబ్బంది ముఖానికి మాస్కులు ధరించి బర్మింగ్‌హామ్ విమానాశ్రయం నుంచి బయటికి వస్తున్నట్లు కన్పించారు. కామన్ వెల్త్ గేమ్స్‌లో తొలిసారి వుమెన్స్ క్రికెట్ టోర్నీ జరగబోతుండడంతో ఈ టోర్నీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. గోల్డ్ మెడల్ ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా ఉంది.

Story first published: Tuesday, July 26, 2022, 20:28 [IST]
Other articles published on Jul 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+