CWG Cricket Final : హార్ట్ బ్రేక్! గెలుపు అంచుల్లో బోల్తాపడ్డ భారత అమ్మాయిలు.. గోల్డ్ మెడల్ జస్ట్ మిస్

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ (గోల్డ్ మెడల్) గెలవాలనుకున్న భారత జట్టు కల త్రుటిలో చేజారింది. 162పరుగుల లక్ష్యఛేదనలో ఇండియా చివరి ఓవర్లో ఆలౌటైంది. తద్వారా 9పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. అసాధారణ పోరాటం చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65పరుగులు 43బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు విలువ లేకుండా పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతుండడం భారత్ కొంపముంచింది. ఒకానొక దశలో భారత్ గెలుపు ఖాయమనిపించింది. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా వైపు మ్యాచ్ తిరిగింది. ముఖ్యంగా అష్లీ గార్డ్‌నర్ 3కీలక వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పింది.
హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా పోరాడినా..
ఇక ఛేదనకు దిగిన ఇండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్లు ఎస్ మంధాన్ (6), సఫాలీ వర్మ (11) వెంటవెంటనే ఔటయిపోవడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. అయితే ఈ తరుణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జెమీమా రోడ్రీగ్స్ (33పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరు స్ట్రైక్ రోటేట్ చేసుకుంటూ స్కోరుబోర్డును ముందుకుతీసుకెళ్లారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 96పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే ఈ జోడీని స్కట్ విడదీసింది. జెమీమా 118పరుగుల వద్ద బౌల్డ్ అయింది. అప్పటికీ భారత్ 33బంతుల్లో 44పరుగులు చేస్తే చాలు. ఇక ఆ తర్వాత ఇండియా రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోతూనే ఉంది. హర్మన్ చెత్త షాట్ ఆడి ఔటయింది. ఇక చివర్లో దీప్తి శర్మ (13) కాస్త టచ్‌లో కన్పించినా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో భారత ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 11పరుగులు చేయాల్సిన తరుణంలో ఒక రనౌట్, ఒక ఎల్బీడబ్ల్యూతో భారత్ ఆలౌటైంది. తద్వారా తొట్టతొలి కామన్ వెల్త్ గోల్డ్ మెడల్ ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లింది. భారత్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతకుముందు బెత్ మూనీ హాఫ్ సెంచరీతో..
ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ మెగ్ లానింగ్ (36పరుగులు 26బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్), ఓపెనర్ బెత్ మూనీ (61పరుగులు 41బంతుల్లో 8ఫోర్లు) రాణించారు. అలీషా గార్డ్ నర్ (25పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఉన్నంత సేపు ప్రమాదకరంగా ఆడింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 161పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహ రానా 2, రేణుక సింగ్ 2, దీప్తి శర్మ, రాధాయాదవ్ తలా ఓ వికెట్ తీశారు.
తుది జట్లు :
భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్, రాచెల్ హేన్స్, ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications