Commonwealth games 2022 : బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. పరీక్ష పెడుతున్న వరుణుడు.. భారత జట్టు ఇదే..!

బర్మింగ్‌హామ్ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కొనసాగుతోన్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా క్రికెట్ పోటీలు నిలుస్తున్నాయి. ఈ రోజు భారత మహిళా జట్టు నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. పాకిస్తాన్ మహిళా జట్టును ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ సోనీ టెన్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3వికెట్ల తేడాతో అనూహ్యంగా భారత వుమెన్స్ జట్టు ఓడిన సంగతి తెలిసిందే.
ఇకపోతే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు వరుణుడు కాసేపు పరేషాన్‌కు గురి చేశాడు. చిరుజల్లులతో కూడిన వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. 3.30కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ లేటుగా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడిన హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. మేం ముందుగా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. అదే జరిగినందుకు హ్యాపీగా ఉంది. మా జట్టు తరఫున రెండు మార్పులు ఉన్నాయి. ఇక డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి మేం ఛేజింగ్ చేసేటప్పుడు మా టార్గెట్ ఎంతో నిర్దిష్టంగా తెలుస్తుంది అని పేర్కొంది. ఇకపోతే టాస్ అనంతరం మళ్లీ వర్షం ప్రారంభం అయింది. స్టేడియానికి చాలా మంది ప్రేక్షకులు చేరుకున్నారు. ఇక వర్షం కాసేపట్లో ఆగితే మ్యాచ్ ఓవర్లు కుదించి నిర్వహిస్తారు.. ఆగకపోతే మాత్రం మ్యాచ్ రద్దయి ఇరు జట్లకు చెరి సమానంగా పాయింట్లు వస్తాయి.
తుది జట్లు :
పాకిస్థాన్ వుమెన్స్ (ప్లేయింగ్ XI): ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), ఒమైమా సోహైల్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డయానా బేగ్, అనమ్ అమీన్
భారత్ వుమెన్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications