Commonwealth games 2022 : దాదాపు గెలిచినట్టే అనిపించింది కానీ ఆ ఆసీస్ పిల్ల వల్ల ఇండియాకు ఓటమి తప్పలేదు

బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ గేమ్స్ - 2022లో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్ టీంతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు దాదాపు గెలిచినంత పని చేసినా.. త్రుటిలో పరాజయం ఎదురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 154పరుగులు చేయగా.. తర్వాత ఉత్కంఠకర రీతిలో సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 19ఓవర్లలోనే 7వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 3వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డనర్ (52పరుగులు 35బంతుల్లో 9ఫోర్లు నాటౌట్) కడవరకు క్రీజులో నిలబడి విజయ లాంఛనాన్ని ముగించింది.

ఒకానొక దశలో ఆసీస్‌కు ఓటమి ఖాయమనిపించినా..
ఒకానొక దశలో 49కే 5వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాకు ఓటమి ఖాయమనిపించింది. కానీ అనూహ్యంగా గ్రేస్ హారిస్ (37పరుగులు 20బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) సపోర్ట్‌తో ఆష్లీ గార్డనర్ మళ్లీ ఆసీస్‌ను గెలుపు రేసులోకి తీసుకొచ్చింది. గ్రేస్ హారిస్ ఔటయినప్పటికీ.. 8వ వికెట్‌కు అలానా కింగ్ (18పరుగులు)తో కలిసి గార్డ్‌నర్ వీరోచిత పోరాటాన్ని కనబర్చింది. ఆస్ట్రేలియా వుమెన్స్ టీం ఆడుతుంటే.. ఒకప్పటి పాంటింగ్ సారథ్యంలోని మెన్స్ టీం ఎలా ఆడేది అలా అన్పించింది. ఓ వైపు వికెట్లుకోల్పోతున్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో టెయిలెండర్ల సహాయంతో ఆసీస్ బ్యాటర్లు మ్యాచ్‌లు ఎన్నోసార్లు గెలిపించారు.

అంతకుముందు హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు బ్యాటింగ్ చేయగా.. 5బౌండరీలతో దూకుడు కనబర్చిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా(24) కీపర్ క్యాచ్ ఔటయ్యింది. 25పరుగులకే భారత జట్టు వికెట్ కోల్పోయినప్పటికీ.. సఫాలీ వర్మ (48పరుగులు 33బంతుల్లో 9ఫోర్లతో) కాసేపు దడదడలాడించింది. ఇక చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్ (52పరుగులు 34బంతుల్లో 8ఫోర్లు 1సిక్సర్) రాణించడంతో భారత్ 154పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జోనాసేన్ 4, స్కాట్ 2, డ్రేస్ బ్రౌన్ 1 వికెట్ తీయగా.. భారత బౌలర్లలో రేణుక సింగ్ 4, దీప్తి శర్మ 2, మేఘన సింగ్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున మేఘన సింగ్ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది. ఇకపోతే భారత్ రెండో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో 31న, మూడో మ్యాచ్‌ను బార్బడోస్‌తో ఆగస్టు 3న ఆడనుంది.

తుది జట్లు :
ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ (వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్ ( కెప్టెన్ ), తహ్లియా మెక్‌గ్రాత్, రాచెల్ హేన్స్, ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలానా కింగ్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
ఇండియా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications