Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తోపు కీపింగ్ ప్లస్ ఫీల్డింగ్..! న్యూజిలాండ్ కీపర్ డెవన్ కాన్వే ఫీల్డింగ్ నోరెళ్లబెట్టిన కామెంటేటర్లు..

Commentators Surprised by the Devon Conway Excellent Keeping plus Fielding skills

న్యూజిలాండ్ వేదికగా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య ముక్కోణపు టీ20 సిరీస్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు న్యూజిలాండ్‌ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ జరిగింది.. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (53 బంతుల్లో 79 పరుగులు 11ఫోర్లు నాటౌట్) మరోసారి ఛేదనలో సత్తా చాటాడంతో పాక్ 6వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ విషయంలో న్యూజిలాండ్ కీపర్ డెవాన్ కాన్వే ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతని కీపింగ్ ప్లస్ ఫీల్డింగ్ స్కిల్స్‌కు సహచర ప్లేయర్లతో పాటు కామెంటేటర్లు, ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

చివరి క్షణంలో అద్భుతంగా బౌండరీని ఆపి..

న్యూజిలాండ్‌లోని హగ్లీ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 148పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ టైంలో.. క్రీజులో షాదాబ్, బాబర్ ఉన్నారు. అప్పటికీ 51బంతుల్లో 55పరుగులు కావాల్సిన టైం. ఈ క్రమంలో బౌలింగ్‌కు సౌతీ దిగాడు. క్రీజులో బ్యాటింగ్ వైపు ఉన్న షాదాబ్ సూపర్ స్కూప్ షాట్ ఆడాడు. ఇక ఆ షాట్‌కు బంతి తప్పకుండా ఫోర్ పోవాల్సిందే. అయితే కీపర్ డెవాన్ కాన్వే అద్భుతం చేశాడు. స్కూప్ షాట్ ఆడిన వెంటనే.. వేగంగా బంతిని అంచనా వేస్తూ బౌండరీ వైపు పరిగెత్తాడు. బంతి స్టప్ తిని వేగంగా బౌండరీ వైపు వెళ్తుండగా.. అద్భుతంగా ఛేజ్ చేశాడు. కీపర్ స్థానం నుంచి ఏకంగా 55 మీటర్ల మేర అతను ఏకధాటిగా ఛేజింగ్ చేస్తూ.. బంతి ఒక్క సెకన్లో బౌండరీ లైన్‌ను దాటుతుందనగా.. డైవ్ చేసి తన కాళ్లతో పక్కకు నెట్టాడు. అంతలోపు ఫైన్ లెగ్ ఫీల్డర్ వచ్చేసి బంతిని అందుకుని వెంటనే పిచ్ వైపు విసిరాడు. దీంతో రెండు రన్స్ సేవ్ అయ్యాయి. అతని కీపింగ్ ప్లస్ ఫీల్డింగ్ నైపుణ్యానికి కామెంటర్లు నోరేళ్లబెట్టారు. సహచరులు కూడా చప్పట్లతో అభినందించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా బాబర్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా బాబర్

ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌‌ డేవన్ కాన్వే (32పరుగులు 31బంతుల్లో), విలియమ్సన్ (31పరుగులు 30బంతుల్లో) నాసిరకంగా ఆడడంతో కివీస్‌కు శుభారంభం దక్కలేదు. చివర్లో చాప్‌మన్ (16 బంతుల్లో 32పరుగులు) ధాటిగా ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా.. వసీం జూనియర్, నవాజ్ తలా 2వికెట్లు తీశారు. దీంతో కివీస్ జట్టు 20ఓవర్లకు కేవలం 147పరుగులు మాత్రమే చేయగలిగింది. 148పరుగుల లక్ష్య ఛేదనలో బాబర్ ఆజామ్‌కు తోడు షాదాబ్ ఖాన్‌ (34పరుగులు 22బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో 18.2ఓవర్లలోనే పాక్ విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజామ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇరు జట్లు

ఇరు జట్లు

న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మైఖేల్ బ్రేస్‌వెల్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, బ్లెయిర్ టిక్నర్

పాకిస్థాన్ ప్లేయింగ్ 11 : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వాసిం జూనియర్, హారీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

Story first published: Saturday, October 8, 2022, 18:57 [IST]
Other articles published on Oct 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+