Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ 'రూట్‌'లో లైన్లన్నీ బిజీ: సెంచరీ వీరుడిపై సెహ్వాగ్

రాజ్‌కోట్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన సహచర, ప్రస్తుత ఆటగాళ్లు ఎవరైనా ఏదైనా సాధించిన లేక పుట్టినరోజు జరుపుకుంటున్నా తనదైన శైలిలో ట్విట్టర్‌లో సెహ్వాగ్ రెచ్చిపోవడాన్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం.

రాజ్‌కోట్ టెస్టు, డే1: ఇంగ్లాండ్ 311/4, రూట్ సెంచరీ

తాజాగా రాజ్‌కోట్ వేదిగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.

Commentator Virender Sehwag trolls Joe Root with a hilarious one liner

మొదటి రోజున ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోయ్ రూట్ 124, మెయిన్ అలీ 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ జట్టు 102 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోయ్ రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ఈ క్రమంలో కామెంటరీ బాక్సులో ఉన్న సెహ్వాగ్ తనదైన శైలిలో జోయ్ రూట్‌పై హ్యూమరస్‌తో స్పందించాడు. హిందీలో కామెంటేటర్ చెప్పిన సెహ్వాగ్ భారత బౌలర్లు మాజీల వికెట్లు సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలని సూచించాడు.

ఆ తర్వాత ఇంకో అడుగు ముందుకేసి "Is Root ki sabi liney vyast hain." అంటూ చెప్పడంతో సెహ్వాగ్ మాటలపై ట్విట్టర్‌లో ఫన్నీ ట్వీట్స్ పోస్టు చేశారు. కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సెహ్వాగ్ సోషల్ మీడియాలో తనదైన శైలి పోస్టులతో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో జోయ్ రూట్ 124 పరుగుల చేసి ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 180 బంతులు ఎదుర్కొన్న జోయ్ రూట్ 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 124 పరుగులు సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+