మీ అబ్బాయి బాగా ఆడుతున్నాడు: విహారిని మెచ్చుకుంటూ హర్షా భోగ్లే తెలుగు ట్వీట్


హైదరాబాద్: ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆంధ్రా ఆటగాడు హనుమ విహారిని ప్రశంసిస్తూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్టులో తెలుగు తేజం హనుమ విహారి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి తనెంత స్పెషల్ ఆటగాడో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హనుమ విహారి 124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. తద్వారా ఆరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన 26వ భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
భారత్ తరఫున ఇప్పటి వరకు రసీ మోడీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. 1946లో రసీ మోడీ 57 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. 1996లో లార్డ్స్ టెస్ట్‌లో సౌరవ్ గంగూలీ 131 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 95 పరుగులతో ఈ ఘనత సాధించారు.
దీంతో పాటు అరంగేట్రం టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కనీసం హాఫ్ సెంచరీని సాధించిన ఐదో క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో రోహిత్ శర్మ, సురేశ్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, ప్రవీణ్ ఆమ్రే ఉండగా తాజాగా ఈ జాబితాలో కూడా హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు.
హనుమ విహారి తల్లికి హర్షా భోగ్లే ట్వీట్
ఈ సందర్భంగా కామెంటేటర్ హర్షా భోగ్లే.. హనుమ విహారి తల్లికి ఓ ట్వీట్ చేసాడు. "విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు 16వేలకు పైగా లైక్స్ రాగా, మూడున్నర వేల మంది రీట్వీట్ చేశారు. హర్షా బోగ్లే ఇప్పటివరకు చేసిన ట్వీట్స్‌లో ఇదే అత్యధిక లైక్స్, రీట్వీట్స్ పొందిన ట్వీట్ కావడం విశేషం.

భోగ్లేను కామెంటర్‌గా ఎంపిక చేయని బోర్డు
భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడే సమయంలో అభిమానులు కామెంటేటర్ల రూపంలో ఎక్కువగా వినే గొంతుల్లో హర్షా భోగ్లేదే ఒకటి. అయితే, ప్రస్తుతం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో హర్షా భోగ్లేను కామెంటేటర్‌గా ఎంపిక చేయలేదు. ఈ సిరిస్‌లో భారత్ తరుపు నుంచి కామెంటేటర్ బాధ్యతలను భజ్జీ నిర్వహిస్తున్నాడు.

మరాఠీ కుటుంబానికి చెందిన హర్షా భోగ్లే
ఇక, హర్షా భోగ్లే విషయానికి వస్తే మరాఠీ కుటుంబానికి చెందిన వ్యక్తి. పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. బేగంపేట్ హైదరాబాద్ స్కూళ్లో చదువుకున్న హర్షా బోగ్లే... ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. క్రికెట్ కామెంటేటర్‌గా తనదైన ముద్ర వేసుకున్న హర్షా భోగ్లే "వాయిస్ ఆఫ్ క్రికెట్" అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.

అప్పుడప్పుడు తెలుగులో కామెంటేటరీ
అప్పుడప్పుడు భోగ్లే తన కామెంటేటరీలో తెలుగు పదాలు కూడా పలుకుతుంటారు. పన్నేండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన హనుమ విహారికి అన్నీతానై పెంచి, పెద్ద చేసింది విహారి అమ్మ విజయలక్ష్మి. ఆమె కష్టం గురించి, విహారి ఆట గురించి తెలుసుకున్న హర్షా బోగ్లే ఇలా తెలుగులో ట్వీట్ చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications