Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దెబ్బకు దెబ్బ కొట్టిన దాదా..చరిత్రలో నిలిచిన మాస్ రివెంజ్ స్టోరీ (Video)

2002లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. సినిమా లెవల్‌‌లో ఉత్కంఠ, మలుపులు, ప్రతీకార సంబరాలతో ఇరు జట్లు మధ్య మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్ చేసిన అతి సంబరాలను అయిదు నెలల్లోనే సౌరవ్ గంగూలీ లార్డ్స్‌లో బదులుతీర్చుకోవడం హైలైట్. చరిత్రలో నిలిచిన ఈ ప్రత్యేకమైన క్షణాలకు నేటితో 22 ఏళ్లు గడిచాయి.

ఈ రివెంజ్ స్టోరీ 2022 ఫిబ్రవరి 3న మొదలైంది. భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ ఆరు వన్డేలు ఆడింది. సిరీస్‌లో 3-2తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనూ ఫేవరేట్‌గా నిలిచింది. ఈ పోరు ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 255 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ విజయానికి ఆఖరి ఓవర్‌కు 11 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి.

Commemorate the 22nd Anniversary of Sourav Ganguly s Iconic NatWest Series Final Celebration


ఫ్లింటాఫ్ ఫైనల్ ఓవర్ బౌలింగ్ చేశాడు. తొలి మూడు బంతులకు అయిదు పరుగులు ఇచ్చిన ఫ్లింటాప్ తర్వాత వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. విజయానంతరం వేల మంది భారత అభిమానుల ముందు చొక్కా విప్పి అతిగా సంబరాలు చేశాడు. సిరీస్ 3-3తో డ్రాగా మారింది. అయిదు నెలల అనంతరం నాట్‌వెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. శ్రీలంక కూడా పాల్గొన్న ఈ సిరీస్‌ ఫైనల్‌కు ఇండియా-ఇంగ్లండ్ చేరాయి.

ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అయిదు వికెట్లకు 325 పరుగులు చేసింది. మార్కస్ ట్రెస్కోథిక్ (109), కెప్టెన్ నాజర్ హుస్సేన్ (115) శతకాలతో సత్తాచాటారు. భారీ స్కోరు సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమనుకున్నారంతా. కానీ భారత్ అద్భుతంగా పోరాడింది. తొలి వికెట్‌కు సౌరవ్ గంగూలీ (60), వీరేంద్ర సెహ్వాగ్ (45) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. 14.3 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సాధించారు.

కానీ 106/0తో ఉన్న భారత్ 146/5తో కష్టాల్లో పడింది. సచిన్ టెండూల్కర్ (14), రాహుల్ ద్రవిడ్ (5) తక్కువస్కోరుకే వెనుదిరిగారు. కానీ యువ క్రికెటర్లు మహ్మద్ కైఫ్ (69), యువరాజ్ సింగ్ (87 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. యువీ ఔటైనా టెయిలెండర్లతో కలిసి ఆఖరి ఓవర్‌లో కైఫ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. విజయానంతరం గంగూలీ బాల్కానీలోకి వచ్చి చొక్కా విప్పి సెలబ్రేషన్స్ చేశాడు. ఫ్లింటాఫ్‌‌కు నోరు మూయించేలా దాదా సంబరాలు చేశాడు. ఈ ప్రత్యేకమైన క్షణాలకు నేటితో 22 ఏళ్లు అయ్యాయి.

Story first published: Saturday, July 13, 2024, 11:24 [IST]
Other articles published on Jul 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+