మొన్న ధోని... నిన్న సచిన్... నేడు జులన్ గోస్వామి
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజాలైన మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్‌ల మీద వచ్చిన బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే స్ఫూర్తితో ఇప్పుడు మహిళా క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పిన భారత ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామిపై కూడా ఓ బయోపిక్ తీయనున్నారు.

సినిమా పేరు చక్దాహా ఎక్స్‌ప్రెస్
ఈ సినిమాకు 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే పేరు పెట్టారు. ఈ మేరకు ఒక సినిమాని తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ దర్శకుడు సుశాంత దాస్ తాజాగా వెల్లడించారు. అస్సాంలోని తన నదియా జిల్లా నుంచి ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల వరల్డ్ కప్‌లో జులన్ గోస్వామి అద్భుతమైన ప్రదర్శన వరకు వెండితెరపై చూపించనున్నారు.

హిందీలో మాత్రమే
ఈ సినిమా హిందీలో తెరకెక్కనుంది. స్క్రిప్టింగ్ వర్క్ త్వరలోనే మొదలుపెడతామని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని సుశాంత దాస్ వెల్లడించారు. అయితే జులన్ పాత్ర పోషించేది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. దీనికోసం పొడువుగా ఉన్న కొందరు బాలీవుడ్ నటుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఎవరు పోషిస్తారనే దానిపై రాని స్పష్టత
ఆమె పాత్రని ఎవరు పోషిస్తారనే దానిపై ఇంకా ఫైనలైజ్ కాకపోవడంతో ప్రస్తుతాని ఆ పేరుని బయటకు వెల్లడించలేనని చెప్పారు. 'ఇప్పటికే ధోనీ, సచిన్ బయోపిక్స్‌ను చూశాం. కానీ మహిళా క్రికెటర్‌పై వస్తున్న తొలి బయోపిక్ ఇది' అని ఆయన చెప్పారు. ఈ సినిమాలో జులన్ ఎక్కడెక్కడ ఆడిందో అక్కడికి మా సిబ్బందిని పంపిస్తామని అన్నారు.

దేశంలోని ఎంతో మంది యువతకు ప్రేరణ
ఆమె పదేళ్ల వయసు నుంచి ఎదుర్కొన్న అడ్డంకులపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. ఇది దేశంలోని ఎంతో మంది యువతకు ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో జులన్ గోస్వామి అద్భుతమైన ప్రదర్శనతో.. భారత్ జట్టుని ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications