న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డర్ల ఘనకార్యం, ఒక్క బాల్‌కు 5 పరుగులు(వీడియో)

Comedy of errors! Faheem Ashraf gets off the mark with 5 runs off 1 ball after double overthrow - Watch

హైదరాబాద్: దుబాయ్ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మూడో వన్డే వర్షం కారణంగా ఫలితం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అయితే మ్యాచ్‌లో ఓ కామెడీ 'ఫీల్డింగ్'‌‌అందరి చేత నవ్వులు పూయించింది. ఫీల్డర్ల నిర్లక్ష్యం న్యూజిలాండ్ జట్టుకు ఐదు పరుగుల నష్టం తెచ్చిపెట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ సూపర్ ఫామ్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించింది.

స్క్వేర్‌లెగ్ దిశగా పాక్ బ్యాట్స్‌మెన్ అష్రప్

స్క్వేర్‌లెగ్ దిశగా పాక్ బ్యాట్స్‌మెన్ అష్రప్

ఈ క్రమంలో ఓ గమ్మత్తైన పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్‌లో 49వ ఓవర్ వేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బంతిని పాక్ బ్యాట్స్‌మెన్ అష్రప్ స్క్వేర్‌లెగ్ దిశగా హిట్ చేశాడు. బంతి కాస్త బౌండరీ లైన్‌ వైపుకు వెళ్తుండటంతో అక్కడ ఎవరూ ఫీల్డర్ లేరని గమనించి పరుగు కోసం అష్రఫ్‌ - ఆసిఫ్ అలీల జోడీ పరుగులు తీయడం మొదలుపెట్టారు.

న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కి

న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కి

వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ రెండు పరుగులు పూర్తి చేసి.. మూడో పరుగు కోసం కూడా పరుగెత్తింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫీల్డర్.. బంతిని అందుకుని న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ లాథమ్‌కి అందించాడు. బంతిని అందుకోగానే.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు రనౌట్ కోసం విసిరాడు. అదికాస్తా.. గురి తప్పి.. మిడాన్ దిశగా దూసుకెళ్లింది.

మళ్లీ అందించినా.. దాన్ని వదిలేశాడు

పరుగుతీసేందుకు మరో అవకాశం దొరకడంతో నాలుగో పరుగుని కూడా పాక్ పూర్తి చేసేసింది. ఆ తర్వాత మిడాన్ ఫీల్డర్ బంతిని అందుకుని.. మళ్లీ వికెట్ కీపర్‌కి అందించగా.. దాన్ని అతను వదిలేశాడు. దీంతో.. పాక్‌ ఐదో పరుగును కూడా పూర్తి చేయడంతో దాదాపు స్టేడియమంతా నవ్వేసింది.

 పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు

పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 6.5 ఓవర్లకి 35/1తో నిలిచిన దశలో వర్షం వచ్చింది. దీంతో అనుకోని అవాంతరంతో ఆట కొనసాగే అవకాశం లేకుండాపోయింది. ఈ క్రమంలో అంపైర్లు మ్యాచ్‌ని రద్దు చేయాల్సి వచ్చింది.

Story first published: Monday, November 12, 2018, 16:31 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X