Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భయాన్ని గెలిస్తేనే: 'కోహ్లీకి సాయం చేయడమే నా పని'

హైదరాబాద్: జట్టులోకి పునరాగమనం చేస్తానని చెప్పడం కన్నా చేయడం చాలా కష్టమని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డారు. తొడ కండరాల గాయంతో 2016 అక్టోబర్‌ నుంచి 2017 ఏప్రిల్‌ వరకూ ఆరు నెలలు రోహిత్‌ క్రికెట్‌కు దూరంగా ఉ‍న్న విషయం తెలిసిందే.

పది ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

పది ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు

ఆ తర్వాత రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్‌ను విజేతగా నిలపడంతో పాటు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, శ్రీలంక సిరీస్‌లలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. మొత్తం పది ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు బాదాడు. ఐదు వన్డేలు, మూడు టీ20ల కోసం ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డే

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డే

సెప్టెంబర్ 17న చెన్నై వేదికగా జరిగే తొలి వన్డేతో ఐదు వన్డేల సిరిస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘పునరాగమనం అంత సులువు కాదు. శస్త్రచికిత్స తర్వాత మానసిక బలహీనతలను జయించడం ముఖ్యం. భయాన్ని గెలిస్తేనే ఇది సాధ్యం. నా బ్యాటింగ్‌ చూసేందుకు చాలా సులువుగా కనిపిస్తుంది కానీ చాలా కష్టం' అని రోహిత్ అన్నాడు.

భారత్‌కు ఆడేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటా

భారత్‌కు ఆడేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటా

'ఐపీఎల్‌ ఆడేటప్పుడు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే భారత్‌కు ఆడేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటా. శ్రీలంక సిరీస్‌లో అఖిల ధనంజయ మిస్టరీ స్పిన్‌ను అధ్యయనం చేసిన తర్వాత చాలా తేలికగా ఆడా. పరిస్థితులను బట్టి మ్యాచ్‌కు సిద్ధమవుతా తప్ప ప్రత్యర్థిని చూసి కాదు. ఆస్ట్రేలియాతోనూ అంతే' అని ధావన్ పేర్కొన్నాడు.

ఆసీస్‌లో నాణ్యమైన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లేకపోవడం లోటే

ఆసీస్‌లో నాణ్యమైన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లేకపోవడం లోటే

'అంతర్జాతీయ క్రికెట్‌లో కోర్‌ టీమ్‌ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి అది సమస్య కాదు. ఆసీస్‌లో నాణ్యమైన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లేకపోవడం లోటే. కానీ మిగతా ఆటగాళ్లకు ఐపీఎల్‌ అనుభవం ఉంది. భారత పరిస్థితులు వారికి బాగా తెలుసు. అందుకే ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోం. భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. మైదానంలో కోహ్లీకి సాయం చేయడమే నా పని' అని అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+