రైనా రెండు సార్లు డకౌట్ అవడమే అతని కొంప ముంచిందా..?

హైదరాబాద్: మూడేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు జట్టులో స్థానం సంపాదించుకున్న రైనా.. తనదైన మార్కును చూపించుకున్నాడు. దీంతో అతనిని బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు సైతం ఎంపిక చేశారు సెలక్టర్లు. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పైకి ఎగబాకాలనే ప్రయత్నంలో రైనా తీవ్రంగా సమాయత్తమవుతున్నాడు.
ముక్కోణపు సిరీస్, ఐపీఎల్‌లో ఆడి తన ఆటతీరును మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నాడు. క్రికెట్‌పై ఇంత ఆరాటంతో ఉన్న రైనాను.. అంతర్జాతీయ జట్టులో ఆడుతూ ఉన్నప్పుడే తొలగించారా..? పేలవ ప్రదర్శనతో విసిగి పోయి పక్కకు పెట్టారా..? అనే ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమానికి తలెత్తే ప్రశ్నలు.

డకౌట్ అవడమే కొంప ముంచి:
2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా పదేండ్ల పాటు భారత్ తరపున ఆడి రాటుదేలాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా తన వంతు పాత్ర పోషించాడు. 2015 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. చివరిసారిగా 2015 అక్టోబర్ 25న దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. స్వదేశంలో సఫారీలతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రైనా రెండు మ్యాచుల్లో డకౌట్ అవడమే కొంప ముంచింది.

డకౌట్‌ల ముందు హాఫ్ సెంచరీ నిలవలేదు:
ఆ తర్వాత ఒక హాఫ్ సెంచరీ చేసినప్పటికీ సెలక్టర్లు ఇతడిని పక్కన పెట్టారు. ఆ ఏడాది మొత్తం 20 వన్డేలు ఆడి 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. దాదాపు రెండున్నరేండ్లుగా వన్డే జట్టులో పునరాగమనం కోసం తపించిపోతున్న రైనా..గతేడాది యోయో పరీక్షలో పాసవడంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.

సఫారీలతో టీ20 సిరీస్:
టీ20 సిరీస్‌లో ఈ యూపీ ఆటగాడు వరుసగా మూడు మ్యాచుల్లో 15, 31, 43 స్కోర్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు నిర్ణయాత్మక చివరిదైన మూడో టీ20లో బౌలింగ్‌లోనూ రాణించి కీలకమైన వికెట్ పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ముక్కోణపు సిరీస్‌కు సన్నద్ధమవుతూ:
సఫారీ పరీక్షలో పాసైన రైనా ఇప్పుడు శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టీ20లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. ఉపఖండ పిచ్‌లపై శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీనమైన జట్లను ఎదుర్కోవడం రైనాకు చాలా సులువు. ఓ రెండు భారీ ఇన్నింగ్సులు ఆడితే చాలు భవిష్యత్ మ్యాచుల్లో రైనా స్థానానికి ఢోకా ఉండదు.

రైనాకు కలిసొచ్చే అంశాలు:
రెండొందలకు పైగా వన్డే మ్యాచ్‌లు ఆడిన అనుభవం రైనాకు కొంత కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ జట్టులో ధోనీ తర్వాత రైనానే సీనియర్. బ్యాటింగ్‌లో 93కు పై చిలుకు స్ట్రైక్ రేట్, ఒత్తిడిలోనూ ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే ఆటతీరు ఈ యూపీ బ్యాట్స్‌మన్‌కు అనుకూలించే అంశాలు. అన్నింటికీ మించి కీలకమైన సమయంలో వికెట్ తీయగల బౌలర్‌గానూ రైనా గతంలో అనేకసార్లు రూపించుకున్నాడు.

యువ క్రికెటర్లతో ధీటుగా ఆడుతూ:
ఇక అద్బుతమైన డైవ్‌లు, కండ్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డింగ్ విషయంలో కుర్రాళ్లకు అందనంత ఎత్తులో ఉంటాడు. వన్డేల్లో ఇప్పటికే వంద క్యాచ్‌లు పూర్తి చేసుకుని నిఖార్సైన ఫీల్డర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క బ్యాటింగ్‌లోనే కాకుండా మిగతా అన్ని అంశాల్లోనూ యువ క్రికెటర్లకు దీటుగా ఉన్న రైనా ఆడగలడు.

వన్డే జట్టులో స్థానం సంపాదిస్తా:
జట్టులోకి రావడం కోసం గత రెండేండ్లుగా ఎంతో శ్రమించా. చాలా కాలం తర్వాత భారత జెర్సీని ధరించడంతో ఉద్వేగానికి గురయ్యాను. 2019 ప్రపంచకప్ ఆడటమే నా లక్ష్యం. బంగ్లాదేశ్, శ్రీలంకతో జరుగబోయే ముక్కోణపు టోర్నీ, ఆ తర్వాత ఐపీఎల్..ఈ రెండూ నాకు కీలకం. ఇందులో సత్తా చాటి కచ్చితంగా వన్డే జట్టులో స్థానం సంపాదిస్తా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications