కొంత భయం, మరికొంత ఆందోళన: గంభీర్ భావోద్వేగం
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల తర్వాత తనకు టెస్ట్ జట్టులో చోటు దక్కడం పైన గౌతమ్ గంభీర్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఈ మేరకు అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టాడు. తనకు ఎంత అనుభవమున్నా, కొంత భయంగా, ఇంకొంత ఆందోళనగా ఉందని పేర్కొన్నాడు.
తాను ఎన్నో ఆశలతో ఈడెన్ గార్డెన్స్‌కు వెళ్తున్నానని చెప్పాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కన్నా తనకు మరేదీ ఎక్కువ కాదని చెప్పాడు. అది టెస్ట్ క్రికెట్ అయినా, తెలుపు లేదా ఎరుపు బంతి అయినా ఒకటేనని చెప్పాడు. తొలి టెస్ట్‌కు వెళ్తున్నట్లుగా ఉందన్నాడు.
ఇండియా క్యాప్ ధరించే అవకాశం తనకు మరోసారి ఇచ్చిన బీసీసీఐకి అతను కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీలు చేసి సత్తా చాటిన గంభీర్‌కు న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో జరిగే రెండో టెస్టుకు పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. 2014లో టెస్ట్ మ్యాచ్ ఆడిన గంభీర్.. ఆ తర్వాత చోటు దక్కలేదు.

గంభీర్ పునరాగమనం
రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న గంభీర్.. ఎట్టకేలకు జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్ తొలి టెస్టులో ఆడిన ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో బాధపడుతుండటంతో అతడి స్థానంలో గంభీర్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్
రాహుల్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపాడు. గంభీర్‌ను ఎంపిక చేసేముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతడికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు.

ఇషాంత్ స్థానంలో..
డెంగీ జ్వరంతో తొలి టెస్టు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలోకి ఆఫ్ స్పిన్నర్ అయిన జయంత్ యాదవ్‌ను ఎంపిక చేశారు. హర్యానాకు చెందిన జయంత్ ఇప్పటి దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు.

యువరాజ్ సింగ్
ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ చేపట్టిన తొలి ఎంపిక ఇదే. ఆసక్తికర విషయం ఏమిటంటే గంభీర్‌తో పాటు మరో సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ సైతం ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యాడు. అతనూ ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications