Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెలెక్టర్లు అలా చెపితే.. మళ్లీ ఆడేందుకు సిద్ధం: ఇర్ఫాన్ ‌పఠాన్

Come and tell me you have 1 year: Irfan Pathan ready to come out of retirement if communication is made

ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ ఆడడం క్రికెటర్లకు మామూలే. చాల దేశాల క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చి మళ్లీ దేశం తరపున ఆడారు. ఇమ్రాన్ ఖాన్, జావేద్ మినాడాడ్, కెవిన్ పీటర్సన్, కార్ల్ హూపర్, డ్వేన్ బ్రేవో వంటి వారు ఇలా చేసినా.. భారతదేశంలో మాత్రం ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. అయితే ఏడాది సమయమిచ్చి సెలెక్టర్లు టీమిండియా జట్టులోకి ఎంపిక చేస్తామంటే.. మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు.

సెలెక్టర్లు అలా చెపితే

సెలెక్టర్లు అలా చెపితే

తాజాగా సురేశ్‌ రైనాతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో మాట్లాడిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నాడు. 'సెలెక్టర్లు వచ్చి ఇర్ఫాన్‌ నువ్వు రిటైరయ్యావు కానీ.. ఏడాదిలో సన్నద్ధమైతే మళ్లీ టీమిండియాకు ఎంపిక చేస్తాం అని చెబితే, అప్పుడన్నీ వదిలేసి ఆటమీదే దృష్టిసారిస్తా. మనస్ఫూర్తిగా ఆట మీదే ధ్యాసపెట్టి తీవ్రంగా కష్టపడతా. కానీ నన్ను అలా అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు?' అని రైనాను ఇర్ఫాన్‌ ప్రశ్నించాడు.

ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తామంటే సన్నద్ధమవ్వవా:

ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తామంటే సన్నద్ధమవ్వవా:

ఇక నీక్కూడా ఆరు నెలలు సమయమిచ్చి టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తామంటే నువ్వు సన్నద్ధమవ్వవా? అని సురేష్ రైనాను ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశ్నించాడు. అందుకు రైనా మాట్లాడుతూ... కచ్చితంగా దాని మీదే దృష్టిపెడతా అని జవాబిచ్చాడు. 30 ఏళ్లు పైబడి భారత్ జట్టులో చోటు కోల్పోయిన భారత క్రికెటర్లని విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు పర్మీషన్ ఇవ్వాలి అని ప‌ఠాన్ అన్నాడు. 'క్రికెట‌ర్లు అరంగేట్రం చేసే వ‌య‌సు దేశాన్ని బ‌ట్టి మారుతూ ఉంటుంది. ఆసీస్ విష‌యానికి వ‌స్తే.. 29 ఏళ్ల వ‌య‌సులో మైక్ హ‌స్సీ తొలి మ్యాచ్ ఆడాడు. అదే భార‌త్‌లో అయితే 30 ఏళ్లకు ద‌గ్గ‌ర‌ప‌డ్డాడంటే.. అత‌డిని జాతీయ జ‌ట్టు ఎంపిక కోసం దాదాపుగా ప‌రిగ‌ణించరు. అలాంట‌ప్పుడు 30 పైబ‌డి జాతీయ జ‌ట్టు అంచ‌నాల ప‌రిధిలో లేని ఆట‌గాళ్ల‌నైనా విదేశీ లీగ్‌లు ఆడేందుకు అనుమ‌తించాలి' అని పేర్కొన్నాడు.

బీసీసీఐ అనుమ‌తివ్వాలి:

బీసీసీఐ అనుమ‌తివ్వాలి:

ఇదే విషయంపై రైనా మాట్లాడుతూ... 'విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమ‌తివ్వాలి. చాలా దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు లీగ్‌ల్లో పాల్గొన‌డం ద్వారా త‌మ ఫామ్ చాటుకుంటున్నారు. అలాంట‌ప్ప‌డు ఫ్రాంచైజీ క్రికెట్‌కు అనుమ‌తివ్వ‌డమే మంచిది. విదేశీ టీ20 లీగ్స్‌లో భారత క్రికెటర్లని అనుమతించడంపై బీసీసీఐ పునరాలోచించుకోవాలి' అని సూచించాడు.

గత జనవరిలో రిటైర్మెంట్‌:

గత జనవరిలో రిటైర్మెంట్‌:

ఇర్ఫాన్‌ 2003లో టీమిండియాకు ఎంపికై.. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. బ్యాట్‌తోనూ పలు సందర్భాల్లో మంచి పరుగులు సాధించాడు. భారత్ తరఫున 29 టెస్టులాడిన ఇర్ఫాన్‌ 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టీమిండియాకు ఆడిన ఇర్ఫాన్..‌ తర్వాత జమ్మూ కశ్మీర్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. చివరకు ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Story first published: Monday, May 11, 2020, 14:35 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+