న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆస్ట్రేలియా పర్యటన మాదిరి వరల్డ్‌కప్‌లో మార్పులు ఉండవు'

Want To Try All Options Before World Cup Says Bharat Arun | Oneindia Telugu
Combinations used in Australia series may not be used during World Cup: Arun

హైదరాబాద్: ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా భారత జట్టులో చేస్తున్న మార్పులు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో మళ్లీ చేయాల్సిన అవసరమేమీ లేదని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ అన్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా మధ్యాహ్నాం 1.30 గంటలకు జరగనుంది.

<strong>కొత్త ప్రతిపాదన: ఇకపై టెస్టుల్లో కూడా ఫ్రీహిట్</strong>కొత్త ప్రతిపాదన: ఇకపై టెస్టుల్లో కూడా ఫ్రీహిట్

వరల్డ్‌కప్‌లో సమతూకంతో కూడిన జట్టును

వరల్డ్‌కప్‌లో సమతూకంతో కూడిన జట్టును

వరల్డ్‌కప్‌లో సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు వివిధ పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తున్నారో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భరత్ అరుణ్ మాట్లాడుతూ "జట్టు కూర్పుపై ఇప్పటికే అవగాహన ఉంది. వరల్డ్‌కప్‌కు ముందు అన్ని అవకాశాలను మేం ప్రయత్నించాలని అనుకుంటున్నాం" అని చెప్పారు.

నాలుగో వన్డేలో 300 పైచిలుకు పరుగులు ఇవ్వడంపై

నాలుగో వన్డేలో 300 పైచిలుకు పరుగులు ఇవ్వడంపై

"వరల్డ్‌కప్‌కు వెళ్లేముందు మాకేం కావాలో కచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం" అని భరత్ అరుణ్ తెలిపారు. ఇక, మొహాలీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత బౌలర్లు 300 పైచిలుకు పరుగులు ఇవ్వడంపై "మా బౌలింగ్‌ విజయవంతమైన రేటింగ్‌ 75శాతం పైనే ఉంటుంది. ఇది జట్టుకెంతో సానుకూలం. అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి" అని అన్నారు.

ఇంగ్లాండ్‌లో వాతావరణం కీలకం కానుంది

ఇంగ్లాండ్‌లో వాతావరణం కీలకం కానుంది

"ఇప్పుడే ఇలా జరిగినందుకు సంతోషంగా ఉంది. వరల్డ్‌కప్ ముందు మేము ఎక్కడ మెరుగవ్వాలో తెలుసుకోవచ్చు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో మేం కొన్ని మార్పులు చేసుకోవాలి. నేర్చుకొనేందుకు ఇదో చక్కని అవకాశం. అస్టన్‌ టర్నర్‌ను అడ్డుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. మొహాలి పరిస్థితులు ఎదురైతే మేం దానిని అమలు చేస్తాం. ఇంగ్లాండ్‌లో వాతావరణం కీలకం కానుంది. ఆ పరిస్థితుల్లో ఆడే ఆటగాళ్లను గుర్తించడం అవసరం" అని అన్నాడు.

Story first published: Wednesday, March 13, 2019, 12:23 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X