
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. తద్వారా శ్రీలంక క్రికెట్ చరిత్రలో భారీ పరుగుల తేడాతో తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడిన ఇన్నింగ్స్‌గా ఇది నిలిచింది. గురువారం ప్రారంభమైన కొలంబో టెస్టులో టాస్ గెలిచిన కోహ్లీ 622/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

మూడుసార్లు మాత్రమే ఎదుర్కొన్న శ్రీలంక
అంతకుముందు 400 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ తేడాను శ్రీలంక జట్టు ఇప్పటిదాకా మూడుసార్లు మాత్రమే ఎదుర్కొంది. 2000లో గాలేలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 419 పరుగుల తేడాతో వెనకబడగా, 2009లో కాన్పూర్‌లో జరిగిన మ్యాచ్ లో 413 పరుగుల తేడాతో వెనుకబడ్డారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 409 పరుగుల తేడాతో
ఆ తర్వాత 2011లో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 409 పరుగుల తేడాతో శ్రీలంక వెనుకబడింది. అయితే ప్రస్తుతం కోహ్లీసేన చేతిలో తొలి ఇన్నింగ్స్‌లో భారీ పరుగుల తేడాతో వెనుకబడటం గత ఇన్నింగ్స్‌ని అధిగమించింది. తద్వారా శ్రీలంక ఈ చెత్త రికార్డుని మూటగట్టుకుంది.

భారత్‌కు మూడో అతిపెద్ద తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
ఇక భారత్ విషయానికి వస్తే ఇది మూడో అతిపెద్ద తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కావడం విశేషం. 2007లో ఢాకాలో బంగ్లాదేశ్‌పై సాధించిన 492 పరుగులే భారత్ సాధించిన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో అగ్రస్ధానంలో ఉండగా, ఆ తర్వాత 2011లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విండిస్‌పై 478 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.


Click it and Unblock the Notifications