
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆ దేశ అపెక్స్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రాండ్ హోమ్‌తో చర్చించిన తర్వాత అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది. ఇక తన రిటైర్మెంట్ సందర్భంగా గ్రాండ్‌హోమ్.. న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని చెప్పాడు. 36ఏళ్ల గ్రాండ్ హోమ్ వయసు పెరిగిన తన శరీరానికి శిక్షణ తీసుకోవడం కష్టమవుతుందని.. గాయాలు వేధిస్తున్నాయని అందువల్ల తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
డిగ్రాండ్‌హోమ్ మొత్తంగా 29టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై సెంచరీలతో సహా 38.70సగటుతో 1432పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 120 నాటౌట్. అలాగే టెస్టుల్లో అతను 32.95 సగటుతో 49వికెట్లను తీశాడు. డి గ్రాండ్‌హోమ్ న్యూజిలాండ్ తరపున 45 వన్డేలు, 41 టీ20లు కూడా ఆడాడు.
న్యూజిలాండ్ క్రికెట్ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రాండ్‌హోమ్ తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ..'నా వయసు పెరుగుతుంది. శిక్షణ కష్టతరమవుతోంది. ముఖ్యంగా గాయాలతో నేను ఇబ్బందిపడుతున్నాను. నాకు ఫ్యామిలీతో టైం కేటాయించాలని ఉంది. క్రికెట్ తర్వాత నా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలనే విషయమై కూడా నేను గత కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నాను. 2012లో అరంగేట్రం చేసినప్పటి నుండి న్యూజిలాండ్ తరఫున ఆడే అవకాశం ఇన్నాళ్లపాటు లభించడం నా అదృష్టం. నా అంతర్జాతీయ కెరీర్ గురించి చాలా గర్వంగా ఉంది. ఇక ఈ కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను.' గ్రాండ్ హోమ్ పేర్కొన్నాడు.