For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Coco Gauff : సెరెనా విలియమ్స్ అంటే కేవలం ఆ 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్లే ఎందుకు గుర్తుకొస్తాయో..!

Coco Gauff about Serena Williams Doubles Grandslams Titles

టెన్నిస్ డబుల్స్ వరల్డ్ నంబర్ వన్ కోకో గౌఫ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టెన్నిస్లో కేవలం సింగిల్స్‌లో విజయం సాధించడాన్ని మాత్రమే చూడొద్దని.. డబుల్స్‌లో కూడా ఆటగాళ్ల విజయాల ప్రాముఖ్యతను మరచిపోకూడదని తెలిపింది. ఇటీవల కెనడియన్ ఓపెన్‌లో జెస్సికా పెగులాతో కలిసి కోకో గౌఫ్ డబుల్స్ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ తాను యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక సెరెనా రిటైర్మెంట్ వార్తల సందర్భంగా అందరూ ఆమె 23గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్ అంటూ కీర్తిస్తూ వార్తలు రాశారు.

అయితే ఆమె డబుల్స్ ప్రదర్శనను అంతగా పట్టించుకోలేదు. దీనిపై ప్రస్తుత డబుల్స్ నంబర్ వన్ కోకో గౌఫ్ పాయింట్ ఔట్ చేసింది. సెరెనా 23 సింగిల్స్ గెలవడమే కాకుండా గ్రాండ్‌స్లామ్‌లలో 14డబుల్స్ టైటిళ్లను కూడా గెలుచుకున్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొంది. 'ప్రజలు కొన్నిసార్లు డబుల్స్ పట్టించుకోరు.. సెరెనాకు సింగిల్స్‌లో 23గ్రాండ్ స్లామ్‌లు ఉన్నాయి. అయితే ఆమె డబుల్స్‌ ఈవెంట్లో కూడా 14 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచింది. కేవలం సింగిల్స్ గెలిస్తే సింగిల్స్‌లో గొప్ప ప్లేయరేమో.. కానీ ఆమె డబుల్స్ లో కూడా అన్నేసి టైటిళ్లు గెలిచించింది కాబట్టి ఆమె టెన్నిస్‌ ఆటలో అన్నింటా గొప్ప క్రీడాకారిణి.. ఎందుకంటే ఆమె డబుల్స్, సింగిల్స్ అన్నింటా అధిపత్యం చెలాయించింది.' అంటూ గౌఫ్ తెలిపింది.

ఇకపోతే సెరెనా ఆగస్ట్ 17న సిన్సినాటి ఓపెన్‌లో తన మొదటి మ్యాచ్‌లో 40ఏళ్ల బ్రిటన్‌కు చెందిన ఎమ్మా రాడుకానుతో తలపడుతుంది. కెనడియన్ ఓపెన్ గెలిచిన కోకో గౌఫ్ సైతం సిన్సినాటి మాస్టర్స్‌లో పాల్గొంటుంది. రౌండ్ ఆఫ్ 64 మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మేరీ బౌజ్‌కోవాతో ఆమె తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

Story first published: Tuesday, August 16, 2022, 21:38 [IST]
Other articles published on Aug 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+