For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐదేళ్లకు ఒప్పందం: ఐసీసీ స్పాన్సర్‌గా కోకా కోలా

Coca-Cola announces 5-year sponsorship partnership with ICC

హైదరాబాద్: ప్రముఖ కూల్‌డ్రింక్స్ సంస్ధ కోకాకోలా ఐసీసీతో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ప్రెసిడెంట్ టి. కృష్ణకుమార్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ మార్కెట్‌ను కలిగి ఉన్న కోకా కోలా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్ల కాలంలో అన్ని ఐసీసీ టోర్నీలకు కోకాకోలా ప్రచారకర్తగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

అయితే, ఈ ఒప్పందం విలువ మాత్రం ఆయన చెప్పక పోవడం విశేషం. ఈ ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే పురుషుల వన్డే వరల్డ్‌కప్ సహా 2020లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళలు, పురుషుల టీ20 వరల్డ‌కప్ టోర్నీలకు భాగస్వామిగా కోకాకోలో వ్యవహరించనుంది.

"మా భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చిన కోకాకోలా సంస్థను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వందల కోట్లలో అభిమానులున్న క్రికెట్‌కు కోకాకోలా ఐదేళ్ల భాగస్వామిగా ఉండేందుకు ముందుకురావడం చాలా సంతోషంగా ఉంది" అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. ఐసీసీ వరల్డ్‌కప్-2015 కూడా కోకాకోలా స్పాన్సర్‌గా వ్యవహరించింది.

2019లో వన్డే వరల్డ్‌కప్, 2020లో పురుషుల, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ నిర్వహించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో మహిళల టీ20 వరల్డ్‌కప్, అక్టోబరు-నవంబరులో పురుషుల వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. పురుషుల, మహిళల టీ20 వరల్డ్‌కప్ ఒకే ఏడాదిలో, ఒకే దేశంలో జరగడం ఇదే తొలిసారి.

Story first published: Thursday, January 31, 2019, 17:42 [IST]
Other articles published on Jan 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+