న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ vs దక్షిణాఫ్రికా.. యో-యో పాస్‌ మార్కులు పెంచునున్న రవిశాస్త్రి!!

Coach Ravi Shastri to increase Yo-Yo test passing mark to 17 ahead of South Africa series

ముంబై: అంతర్జాతీయంగా ఆమోదించబడిన యో-యో టెస్టును భారత క్రికెట్ జట్టు ఆటగాడి ఫిట్‌నెస్‌ను కొలవడానికి ఒక మార్గంగా అనుసరిస్తుంది. ఇందులో భాగంగానే టీమిండియా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా రెండోసారి ఎంపికైన రవిశాస్త్రి దక్షిణాఫ్రికా సిరీస్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. ఫిట్‌నెస్‌ విషయంలో ఆటగాళ్లు మరింత శ్రద్ధపెట్టాలని మార్పులు చేయనున్నాడు.

<strong>మారని టైటాన్స్ ఆట.. యు ముంబా చేతిలో చిత్తు!!</strong>మారని టైటాన్స్ ఆట.. యు ముంబా చేతిలో చిత్తు!!

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా:

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా:

ప్రస్తుతం ఉన్న యోయో టెస్టు స్కోరు 16.1ని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పెంచే ఉద్దేశంతో ఉన్నాడని సమాచారం తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అర్హత స్కోరును 17కు పెంచాలని శాస్త్రి భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే బీసీసీఐ, ఆటగాళ్లతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాడట.

అర్హత స్కోరు 17:

అర్హత స్కోరు 17:

'అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లు పోటీపడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఇందులో భాగంగానే కనీస అర్హత స్కోరు 17గా ఉండాలి' అని రవిశాస్త్రి అన్నారని సమాచారం తెలిసింది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా సిరీస్‌తోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గురువారం ఆటగాళ్లు, కోచ్, సహాయ సిబ్బంది అందరూ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం:

అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం:

ప్రపంచకప్‌తో రవిశాస్త్రి సహా టీమిండియా సహాయ సిబ్బంది పదవీ కాలం ముగిసింది. విండీస్‌ పర్యటన నేపథ్యంలో వీరి పదవీకాలాన్ని 45 రోజులు పొడగించారు. అనంతరం కపిల్‌దేవ్‌ కమిటీ శాస్త్రిని కోచ్‌గా తిరిగి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జట్టును అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యం అని శాస్త్రి తెలిపాడు. అంతేకాదు యువకులు, అనుభవజ్ఞులతో జట్టును తయారుచేసుకోవాలి కూడా అన్నాడు. ఇందులో భాగంగానే యోయో అర్హత స్కోరు పెంచుతున్నాడు.

పాక్ టూర్‌ను లంక ఆటగాళ్లు బహిష్కరించడానికి కారణం భారతే!!

 సెప్టెంబర్ 15న తొలి టీ20:

సెప్టెంబర్ 15న తొలి టీ20:

వెస్టిండీస్ పర్యటన అనంతరం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 15 నుంచి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరుజట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 15న ధర్మశాలలో తొలి టీ20, 18న మొహాలిలో రెండవ టీ20, 22న బెంగళూరులో మూడవ టీ20 జరగనుంది. అనంతరం 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఉంది. ఇందులో తొలి టెస్ట్ వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, September 11, 2019, 9:14 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X