న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ రిటైర్‌మెంట్ విషయంపై స్పందించిన రవిశాస్త్రి

 Coach Ravi Shastri Reveals Why MS Dhoni Took The Ball From Umpire

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఆడిన మూడో వన్డేలో ఓటమికి గురైనా.. సగటు క్రికెట్ అభిమానిని తొలిచేస్తున్న ప్రశ్న.. ధోని అంపైర్ల నుంచి బంతి ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు క్రీడా అభిమానులను గురి చేస్తున్న గందరగోళం. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో టీమిండియా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు.

దీంతో ఈ దనాధన్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికనున్నట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ప్రస్తుతం ఈ సీనియర్‌ ఆటగాడి ఫామ్‌ కలవరపెట్టడం.. 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి బెల్స్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్‌కు మరింత బలం చేకూర్చింది.

Coach Ravi Shastri Reveals Why MS Dhoni Took The Ball From Umpire

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ అవుతున్న టాపిక్‌ ఈ విన్నింగ్‌ కెప్టెన్‌ రిటైర్మెంట్‌ గురించే కావడం గమనార్హం. అయితే ధోని రిటైర్మెంట్‌ ఊహాగానాలపై భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి స్పందించాడు. సాధారణంగానే రూమర్లపై ఘాటుగా స్పందించే రవిశాస్త్రి మళ్లీ తనదైన శైలిలో విషయంపై విరుచుకుపడ్డారు. రిటైర్మెంట్‌ గురించి వచ్చినవన్నీ వదంతులేనని కొట్టిపడేశారు.

'ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు. ఆ బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించేందుకు మాత్రమే తీసుకున్నాడు. అంతేకానీ, రిటైర్మెంట్‌ యోచనలో ఉండి తీసుకోలేదు. భరత్‌కు ఆ బంతిని చూపించి మ్యాచ్‌లో పడిన ఇబ్బందులు గురించి చర్చించడానికి ధోనీ అలా చేశాడు.' అంటూ రవిశాస్త్రి 'ధోని-బంతి' మిస్టరీపై వివరణ ఇచ్చారు.

Story first published: Thursday, July 19, 2018, 17:57 [IST]
Other articles published on Jul 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X