వచ్చే ఏడాదికి ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక: ద్రవిడ్
బెంగుళూరు: వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న అండర్ - 19 వరల్డ్ కప్‌పై ఇటీవలే కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ తన ప్రణాళికలను వివరించారు. బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
యువ ఆటగాళ్లకు ఎలాంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారో దానిపై బీసీసీఐతో ఇప్పటికీ తాను మంతనాలు జరుపుతున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కోసం ది బెస్ట్ అండర్ -19ను ఏ విధంగా ఎంపిక చేయాలే దానిపై తన దృష్టంతా ఉన్నట్లు పేర్కొన్నారు.

గతంతో పోలిస్తే ఈ కాలం యువ ఆటగాళ్లకు దేన్నైనా చాలా ఈజీగా నేర్చుకుంటారని కొనియాడారు. యువ క్రికెటర్లతో కలిసి పని చేయడం కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని తెలిపారు. ఇది నాకు ఎంతో ఛాలెంజ్‌తో కూడుకున్నదని అన్నారు.
ఆటగాళ్లతో మైదానంలో వ్యూహాలు రచించడం తనకెప్పుడూ ఆసక్తికరమేనని తెలిపాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లతో కలిసి పని చేసేందుకు ఇదో చక్కని అవకాశమని ద్రవిడ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications