
సులువైన క్యాచ్‌ని జారవిడిచిన కుల్దీప్:
తొలి వన్డేలో ఫీల్డింగ్ తప్పిదాలతో 348 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. భారత ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద తడబడటం, ఓవర్ త్రోలు విసరడం జరిగింది. ఇదంతా ఒకెత్తయితే.. రాస్ టేలర్ సులువైన క్యాచ్‌ని కుల్దీప్ యాదవ్ జారవిరచడం మరోఎత్తు. టేలర్ వ్యక్తిగత స్కోరు 10 వద్ద ఇచ్చిన క్యాచ్‌ని కుల్దీప్ జారవిడచడంతో.. చివరి వరకూ అజేయంగా నిలిచి జట్టుని గెలిపించాడు.

తీరికలేని షెడ్యూలు వల్లే:
రెండో వన్డేకు ముందు మీడియా సమావేశంలో కోచ్ శ్రీధర్ మాట్లాడుతూ... 'విండీస్ సిరీస్ నుంచే క్యాచులు వదిలేయడం ఎక్కువైంది. ఫీల్డింగ్ పూర్తిగా దిగజారింది. కానీ.. రెండు మూడేళ్లుగా మా ఫీల్డింగ్ చాలా బాగుంది. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. టీ20ల్లో ప్రతి ఆటగాడు అన్నివైపులా చురుగ్గా ఉండి ఫీల్డింగ్ చేయాలి. ప్రస్తుతం షెడ్యూల్ తీరిక లేకుండా ఉంది. న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ముందు ఫీల్డింగ్ డ్రిల్స్‌కు ఒక్క సెషన్ మాత్రమే దొరికింది. టైట్ షెడ్యూల్ కారణంగా ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉండదు' అని తెలిపారు.

కుల్‌దీప్ ఆ క్యాచ్‌ను అందుకుంటే బాగుండేది:
'జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్ల పనిభారాన్ని సమీక్షిస్తుంది. అలసిపోతే సేదతీరేందుకు సమయం ఇస్తున్నాం. ప్రస్తుతం జట్టు ఫిట్‌నెస్ స్థాయి అమోఘం. అందుకే పనిభారం ఉన్నా.. త్వరగా అలసట నుంచి తేరుకుంటున్నారు. ఫీల్డింగ్ బాగా చేయకపోవడానికి అలసటను సాకుగా చూపొద్దు. టేలర్ క్యాచ్‌ను కుల్‌దీప్ అందుకుంటే బాగుండేది. అంతక ముందు ఓవర్‌లోనే అతను బౌలింగ్ చేసి ఉండటంతో.. ఆ ఓవర్‌లో పరుగులిచ్చిన తీరు గురించి బహుశా అతను ఆలోచిస్తూ ఉండొచ్చు. అది సాంకేతిక తప్పిదం కాదు' అని శ్రీధర్ అన్నారు.

మునుపటి ప్రమాణాల్ని అందుకుంటాం:
'కారణాలు ఏవైనప్పటికీ ఫీల్డింగ్ మెరుగుపర్చుకొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆటగాళ్లు చెప్పేది విని సూచనలు చేస్తున్నాం. ఫీల్డింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చూపించే శ్రద్ద బాగుంది. అందరూ అతన్ని ఫాలో అవుతున్నారు. కొత్తగా వచ్చే యువకులకు అతడిని ఆదర్శంగా చూపిస్తాం. ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్ లోపు మళ్లీ మునుపటి ప్రమాణాల్ని అందుకుంటాం' అని శ్రీధర్ ధీమా వ్యక్తం చేసారు. .


Click it and Unblock the Notifications












